Shakeela Health : బతికే ఉన్నా..ఆరోగ్యం బాగానే ఉంది

షకీల...ఈమె గురించి తెలియని వారుండరు. శృంగార తారగా పేరు పొందిన ఈమె స్టార్ హీరోలకు ధీటుగా పోటీనిచ్చారు. అయితే..గత కొన్ని రోజులుగా ఈమెపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. షకీలా మరణించారని పుకార్లు షికారు చేస్తున్నాయి. జరుగుతున్న ప్రచారంతో షకీలా దిగ్ర్భాంతికి గురయ్యారు.

Shakeela Health : బతికే ఉన్నా..ఆరోగ్యం బాగానే ఉంది

Shakeela

Updated On : July 31, 2021 / 9:48 AM IST

Actress Shakeela : షకీల…ఈమె గురించి తెలియని వారుండరు. శృంగార తారగా పేరు పొందిన ఈమె స్టార్ హీరోలకు ధీటుగా పోటీనిచ్చారు. అయితే..గత కొన్ని రోజులుగా ఈమెపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. షకీలా మరణించారని పుకార్లు షికారు చేస్తున్నాయి. జరుగుతున్న ప్రచారంతో షకీలా దిగ్ర్భాంతికి గురయ్యారు. తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు.

Read More : Petrol Rates India : పెట్రోల్ రేట్ల ధరల్లో నో ఛేంజ్

తాను ఆరోగ్యంగా ఉన్నట్లు, మిలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెతో తీసుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. మిలా లేకపోతే..తనకు జీవితమే లేదు..తనకు తోడు మిలానే అని షకీలా వెల్లడించారు. దక్షిణ భారత చలన చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఈమెకు మళయాళ శృంగార చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపునిచ్చింది. మలయాళంలో ఒకప్పుడు షకీలా సినిమాలు చాలా క్రేజ్. ఈమె సినిమాల ముందు తమ సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయా ? అని స్టార్ హీరోలు సైతం భయపడేవారు. 2003 నుంచి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తున్నారు. తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హింది సినిమాలు చేశారు.