Om Raut : హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఆదిపురుష్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు..

తాజాగా గురువారం(మార్చ్ 6) నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేసి ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023నే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

Om Raut : హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఆదిపురుష్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు..

Adipurush Director Om Raut visits Karman Ghat Hanuman Temple on Hanuman Jayanthi

Om Raut :  ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల కొన్ని నెలల క్రితం టీజర్ రిలీజ్ తర్వాత ఆదిపురుష్ పై, డైరెక్టర్ ఓం రౌత్ పై భారీగా విమర్శలు వచ్చాయి. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది, రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శించారు. ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేశారు. దీంతో 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించిన ఈ సినిమాని ఈ విమర్శలు చూసి మరింత గ్రాఫిక్ వర్క్స్ చేయాలని 16 జూన్ 2023కి వాయిదా వేశారు.

Chor Nikal Ke Bhaga : అందులో RRR రికార్డ్ బద్దలుకొట్టిన బాలీవుడ్ సినిమా..

ఇటీవల శ్రీరామనవమికి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా గురువారం(మార్చ్ 6) నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేసి ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023నే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఉన్న ప్రముఖ హనుమాన్ ఆలయాన్ని దర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీంతో పలువురు ప్రముఖులు కూడా ఓం రౌత్ వెంట ఆలయానికి విచ్చేసారు. ఓం రౌత్ వచ్చాడని తెలిసి చుట్టుపక్కల ఉన్న ప్రభాస్ అభిమానులు కూడా హనుమాన్ ఆలయానికి తరలివచ్చారు. హనుమాన్ ఆలయంలో ఓం రౌత్ పూజలు నిర్వహించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.