Oh My God 2 : ఆదిపురుష్ ఎఫెక్ట్.. ‘ఓ మై గాడ్ 2’కు ఏకంగా 20 సెన్సార్ కట్స్.. అవన్నీ మార్చాల్సిందే.. లేకపోతే..

ఇటీవలే ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. గత సినిమాలో కృష్ణుడితో తీస్తే, ఇప్పుడు శివుడి పాత్రతో తీస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కి వెళ్లడంతో ఈ సారి సెన్సార్ బోర్డ్ చూడటమే కాకుండా ఒక రివ్యూ కమిటీకి కూడా ఈ సినిమాని చూపించినట్టు తెలుస్తుంది.

Oh My God 2 : ఆదిపురుష్ ఎఫెక్ట్.. ‘ఓ మై గాడ్ 2’కు ఏకంగా 20 సెన్సార్ కట్స్.. అవన్నీ మార్చాల్సిందే.. లేకపోతే..

Adipurush effect on Censor Board 20 Cuts to Oh My God 2 Movie

Oh My God 2 Movie  :  ఇటీవల ఆదిపురుష్(Adipurush) సినిమాపై సినిమాలోని డైలాగ్స్, పాత్రల స్వరూపాలు, కథనం.. ఇలా అన్ని విషయాల్లోనూ రామాయణంలా లేదని దేశవ్యాప్తంగా వివాదం అయిన సంగతి తెలిసిందే. అయితే ఏ సినిమా అయినా బయటకి రావాలంటే సెన్సార్ బోర్డ్ చూసి క్లియర్ చేసి పంపాలి. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతదేశంలో మతం లాంటి సినిమాలను సున్నితంగా డీల్ చేయకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇవేమి పట్టించుకోకుండా సెన్సార్ బోర్డ్ ఆదిపురుష్ కి క్లియరెన్స్ ఇచ్చిందని అంతా తప్పు పట్టారు.

ఆదిపురుష్ సినిమా ఎఫెక్ట్ సెన్సార్ బోర్డ్ పై గట్టిగానే పడింది. దీంతో ఇప్పుడు ఓ మై గాడ్ 2 సినిమాకు జాగ్రత్త వహిస్తుంది. 2012లో అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ముఖ్య పాత్రల్లో వచ్చిన ఓ మై గాడ్ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో గోపాల గోపాల అని రీమేక్ కూడా చేసారు. ఇప్పుడు ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ సారి అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.

ఇటీవలే ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. గత సినిమాలో కృష్ణుడితో తీస్తే, ఇప్పుడు శివుడి పాత్రతో తీస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కి వెళ్లడంతో ఈ సారి సెన్సార్ బోర్డ్ చూడటమే కాకుండా ఒక రివ్యూ కమిటీకి కూడా ఈ సినిమాని చూపించినట్టు తెలుస్తుంది. దీంతో ఆ కమిటీ ఓ మై గాడ్ 2 సినిమాకు ఏకంగా 20 కట్స్ చెప్పింది. సెన్సార్ బోర్డు చెప్పిన ఆ 20 కట్స్ మార్చాలి లేదా తీసేయాలి. అలా అయితేనే సెన్సార్ సర్టిఫికెట్ వస్తుంది అని హెచ్చరించింది చిత్రయూనిట్. ఆ 20 మార్పులు చేసేవరకు, లేదా సినిమాలోంచి వారిని తీసేవరకు సర్టిఫికెట్ ఇవ్వము అని చెప్పేసింది సెన్సార్ బోర్డు. అలాగే ఈ సినిమాకి A సర్టిఫికెట్ అంటే పెద్దలు మాత్రమే చూసే సినిమా ఇచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయట.

Atlee : బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న అట్లీ.. జవాన్ తర్వాత ఆ యువ హీరోతో సినిమా..

మరి ఓ మై గాడ్ 2 చిత్రయూనిట్ సెన్సార్ బోర్డు చెప్పిన మార్పులు చేస్తుందా లేదా చూడాలి. ఆదిపురుష్ విషయంలో సెన్సార్ బోర్డు పై తీవ్ర విమర్శలు రావడమే కాక పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో మతం ఆధారంగా వచ్చిన సినిమాలని మరింత జాగ్రత్తగా చూసి సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మతం ఆధారంగా కథతో తీసిన ఓ మై గాడ్ 2 సినిమాని చాలా జాగ్రత్తగా చూశారని, అందుకే అన్ని కట్స్ ఇచ్చారని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు ఇలాగే వ్యవహరిస్తుందో లేదో చూడాలి.