Afghanistan: అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి?.. 40 మందికి గాయాలు

అఫ్గానిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 40 మంది తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఓ తాలిబన్ అధికారి మాత్రం 20 మంది మృతి చెందారని తెలిపారు.

Afghanistan: అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి?.. 40 మందికి గాయాలు

15 children killed in school bombing in Afghanistan

Afghanistan: అఫ్గానిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 40 మంది తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఓ తాలిబన్ అధికారి మాత్రం.. 20 మంది మృతి చెందారని తెలిపారు.

బాంబుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాది విఫలమయ్యాడు. దీంతో కార్యాలయం వెలుపలే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే టర్కీ, చైనాతో పాటు పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గాన్ అధికారులతో ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయంలో చైనా అధికారులు ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 40 మంది గాయపడ్డారని ఇటలీకి చెందిన ఓ సంస్థ తెలిపింది.

ఈ దాడిపై కాబూల్ పోలీసులు స్పందిస్తూ దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ బాంబు దాడులు ఆగడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.

MP Sadhvi Pragya: ‘ఇంట్లో ఆయుధాలు పెట్టుకోండి’ వ్యాఖ్యలపై మరోసారి బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా స్పందన