Kaikala Satyanarayana : ఎస్వీ రంగారావు తరువాత కైకాలే..
తెలుగుతెరపై జానపదం, పౌరాణికం పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఒక బలమైన ముద్ర వేసిన నటుడు 'కైకాల సత్యనారాయణ'. గత కొంతకాలంగా అయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో, ఇంటివద్దే చికిత్స అందిస్తూ వస్తున్నారు వైద్యులు. 87 ఏళ్ళ కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా కైకాల సత్యనారాయణ..

After SV Ranga Rao, Kaikala Satyanarayana reached that stardom
Kaikala Satyanarayana : తెలుగుతెరపై జానపదం, పౌరాణికం పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఒక బలమైన ముద్ర వేసిన నటుడు ‘కైకాల సత్యనారాయణ’. 60 సంవత్సరాల సినీజీవితంలో దాదాపు 770కి పైగా సినిమాల్లో నటించారు కైకాల. కాగా గత కొంతకాలంగా అయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో, ఇంటివద్దే చికిత్స అందిస్తూ వస్తున్నారు వైద్యులు. 87 ఏళ్ళ కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
Kaikala Satyanarayana : యముడంటే కైకాల సత్యనారాయణే..
‘సిపాయి కూతురు’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన కైకాల సత్యనారాయణ.. ఆ సినిమా విజయం కాకపోవడంతో, సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఎన్టీఆర్ చొరవతో మళ్ళీ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. విఠలాచార్య సలహాతో విలన్ పాత్రలు నటించడం స్టార్ట్ చేశారు. అదే కైకాల జీవితానికి కీలక మలుపు అయింది. తెలుగుతెరకి విలన్‌ల కొరత ఉన్న సమయంలో కైకాల విలనిజం హీరోలకి గట్టి పోటీ ఇచ్చింది.
విలన్ గానే కాదు సపోర్టింగ్ యాక్టర్‌గా, ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా నటించి నవరసనటసార్వబౌవంగా గుర్తింపు సంపాదించుకున్నడు. తన నటనా చాతుర్యంతో ప్రేక్షకుల చేత ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎస్వీ రంగారావు గారు హీరో స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అయన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అంతటి స్టార్ స్టేటస్‌ని అందుకున్నది కైకాల సత్యనారాయణ మాత్రమే.