Gorkha : వార్ హీరోగా అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘గోర్ఖా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి..

Gorkha : వార్ హీరోగా అక్షయ్ కుమార్

Gorkha

Updated On : October 16, 2021 / 2:41 PM IST

Gorkha: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాలు రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడుతుంటే.. మరోవైపు కొత్త సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు. రీసెంట్‌గా ‘రక్షాబంధన్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. ఇప్పుడు కొత్త సినిమా ఫస్ట్‌‌‌లుక్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

ఇండియన్ ఆర్మీలో ఎనలేని సేవలందించి దేశానికి గర్వ కారణంగా నిలిచి, వార్ హీరోగా పేరొందిన మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గోర్ఖా’ అనే పేరు ఫిక్స్ చేశారు. సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Naane Varuven : అన్న దర్శకత్వంలో ధనుష్ సినిమా

అక్షయ్ కుమార్ సమర్పణలో.. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల చేసిన ‘గోర్ఖా’ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ఆకట్టకుంటున్నాయి. వార్ హీరోగా అక్షయ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.