Akshay Kumar : ‘ఓ మై గాడ్’ సీక్వెల్ రెడీ..

సంవత్సరానికి 3, 4 సినిమాలు రిలీజ్ చేస్తున్న అక్షయ్.. లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ మూవీ సీక్వెల్‌కి రెడీ అయ్యారు..

Akshay Kumar : ‘ఓ మై గాడ్’ సీక్వెల్ రెడీ..

Akshay Kumar Oh My God Sequel

Akshay Kumar: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ మరో క్రేజీ మూవీతో బిజీ అవ్వబోతున్నారు. అప్పుడెప్పడో 2012 లో వచ్చిన సూపర్ హిట్ మూవీకి దాదాపు 10 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. మరి ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో, ఎప్పుడు సెట్స్ మీదకెళ్లబోతోందో లెట్స్ హ్యావ్ ఎ లుక్.
వాయిస్
అక్షయ్ కుమార్ కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. కమర్షియల్ కంటెంట్‌ని కాకుండా స్టోరీ డ్రివెన్ సినిమాలు, సోషల్ ఇంట్రస్ట్ ఉన్న సినిమాలు చెయ్యడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు యాక్షన్ కింగ్. వరుసగా సినిమాలు లైన్లో పెట్టి సంవత్సరానికి 3, 4 సినిమాలు రిలీజ్ చేస్తున్న అక్షయ్.. లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ మూవీ సీక్వెల్‌కి రెడీ అయ్యారు.

అక్షయ్ కుమార్ 2012 లో చేసిన సోషల్ ఇంట్రెస్ట్ మూవీ ‘ఓ మై గాడ్’. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కి సూపర్ సక్సెస్ అయిన ‘ఓ మై గాడ్‘ సినిమాకు 2022 లో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. రెలిజియస్ ఫ్రాడ్స్, మూఢనమ్మకాలు బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కాంట్రవర్సీ అయినా అంతకు మించి సూపర్ సక్సెస్ అయ్యింది.

ఉమేష్ శుక్లా డైరెక్షన్లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు అక్షయ్. అయితే సీక్వెల్‌లో మాత్రం పరేష్ రావల్‌కి బదులుగా పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ ప్లే చెయ్యబోతున్నారు. అంతేకాదు సినిమాని ఉమేష్ శుక్లాకి బదులు అమిత్ రాయ్ డైరెక్ట్ చెయ్యబోతున్నారు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్‌లో మొదలవ్వబోతున్న ‘ఓ మై గాడ్’ సినిమా సీక్వెల్.. ఫస్ట్ పార్ట్‌కి మించి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.