Allu Aravind: ఓటీటీలపై అల్లు అరవింద్ కామెంట్స్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా...

Allu Aravind: ఓటీటీలపై అల్లు అరవింద్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Allu Aravind Comments On Ott Platforms

Updated On : June 3, 2022 / 8:52 PM IST

Allu Aravind: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా, తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్‌లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా పాల్గొని, ప్రస్తుత సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పలు కొత్త పాఠాలు నేర్చుకుందని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించారని.. వారిని తిరిగి థియేటర్లకు రప్పించే బాధ్యత సినిమా ఇండస్ట్రీపైనే ఉందని ఆయన అన్నారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించి, ఓటీటీల్లో సినిమాలను ఆలస్యంగా రిలీజ్ చేస్తేనే ఈ పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలోనే చూడాలని ఆయన కోరారు.

Allu Aravind : ఇండస్ట్రీని దయచేసి అర్థం చేసుకోండి – అల్లు అరవింద్

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే, హీరోహీరోయిన్లు తమ సినిమా ప్రమోషన్స్ తామే చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల ఓ స్టార్ హీరో తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజీపై డ్యాన్స్ కూడా చేశాడని అల్లు అరవింద్ అన్నారు. ఇక ‘పక్కా కమర్షియల్’ సినిమాను దర్శకుడు మారుతి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా తెరకెక్కించాడని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని.. ఇందులో నటించిన నటీనటులకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని అల్లు అరవింద్ కోరారు. మొత్తానికి ఓటీటీలపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.