Allu Arjun : ‘అఖండ’ గురించి వైరల్ అవుతున్న బన్నీ పోస్టులు..

’అఖండ’ టీమ్‌కి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Allu Arjun : ‘అఖండ’ గురించి వైరల్ అవుతున్న బన్నీ పోస్టులు..

Balayya Bunny

Updated On : November 28, 2021 / 3:26 PM IST

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ అనగానే.. ఇద్దరు హీరోల అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. బాలయ్య ప్రస్తుతం ‘ఆహా’ లో టాక్ షో చేస్తున్నారు. బన్నీ ఇంతకుముందు బోయపాటితో ‘సరైనోడు’ సినిమా చేశారు. సో ఆ కారణంగానే ఫంక్షన్‌కి వస్తున్నారు అనే మాటలు వినిపించాయి.

Jai Balayya : బాలయ్య క్లాస్‌లో మాస్.. ఆ స్టెప్పులేంటి స్వామీ..

కట్ చేస్తే.. వేదిక మీద తన మాటలతో బాలయ్య, ఆయన అభిమానులు, తన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. అల్లు – నందమూరి కుటుంబాల మధ్య అనుంబంధం తన తాత గారు అల్లు రామలింగయ్య గారు, నందమూరి తారక రామారావు గారి టైం అప్పుటిదని.. తన తండ్రి అరవింద్, బాలయ్య ఒకే టైం లో కెరీర్ స్టార్ట్ చేశారని, తాను చిరంజీవి, బాలకృష్ణ గార్ల సినిమాలు చూస్తూ పెరిగానని.. తండ్రి లాంటి ఒక పర్సన్ ఫంక్షన్‌కి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి అలరించారు బన్నీ.

ఫంక్షన్ తర్వాత బన్నీ తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్‌లో ‘అఖండ’ టీం కి విషెస్ చెబుతూ పోస్టులు చేశారు. దీనిపై అల్లు – నందమూరి అభిమానులు స్పందించడం.. రీ ట్వీట్స్ చెయ్యడం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. నందమూరి తారకరత్న కూడా బన్నీ పోస్ట్‌పై రెస్పాండ్ అయ్యారు. ‘యువర్ స్పీచ్ ఈజ్ వెరీ స్పెషల్.. థ్యాంక్యూ’ అంటూ బన్నీ ట్వీట్‌ని రీ ట్వీట్ చేశారు నందమూరి తారకరత్న.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)