Aloe Vera Pickle : ఉదర సంబంధిత వ్యాధులను తగ్గించే కలబంద ఊరగాయ పచ్చడి!

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో బాగా ఉపకరిస్తుంది. యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది.

Aloe Vera Pickle : ఉదర సంబంధిత వ్యాధులను తగ్గించే కలబంద ఊరగాయ పచ్చడి!

Aloe vera pickle

Aloe Vera Pickle : కలబందలో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. దీనిలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక గుణాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో బాగా ఉపకరిస్తుంది. యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగటం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

అయితే కలబంద జ్యూస్ తోపాటు కలబందతో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. కలబందతో తయారు చేసే ఊరగాయ పచ్చడి ఉదర సంబంధిత వ్యాధులను తగ్గించటంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కలబంద ఊరగాయ పచ్చడి తయారీ విధానం;

లేత కలబంద మట్టలు తీసుకోవాలి. వాటికి రెండు వైపులా ఉండే ముళ్లను తొలగించాలి. చిన్నచిన్న ముక్కలుగా తరుగుక్కోవాలి. లెక్క ప్రకారం 5కేజీల ముక్కల తరుగు తీసుకుని వాటిని ఒక పాత్రలో వేసి ఆవునెయ్యితో దోరగా వేయించాలి. తరువాత ముక్కల్లో సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. జాడిలో పెట్టుకుని మూత వేసి రెండు రోజులు దానిని ఎండలో ఉంచాలి. మధ్యమధ్యలో జాడీ మూత తీసి దానిని కలుపుతుండాలి.

పసుపు, సొంఠి, జీలకర్ర, నల్లజీలకర్ర, ధనియాలు ఒక్కోక్కటి 100గ్రా మోతాదులో తీసుకుని మెత్తగా మిక్సీకి వేసి పొడిగా చేసుకోవాలి. దీంతోపాటు మిరియాలపొడి 120 గ్రా, ఇంగువ 50గ్రా, పిప్పళ్లపొడి 75గ్రా, వాముపొడి 200గ్రా, దాల్చిన చెక్క, లవంగం , ఏలకులు 50గ్రా, కరక్కాయలపొడి 150 గ్రా, ఆవాల పొడి 150 గ్రా చొప్పున తీసుకుని అన్నింటిన కలిపి కలబంద ముక్కలు ఉన్న జాడీలో వేసి బాగా కలిపి తిరిగి ఎండలో ఉంచాలి. ఇలా చేస్తే రుచికరమైన కలబంద పచ్చడి సిద్ధమౌతుంది. దీనిని అన్నంలోకాని, రొట్టెలలో కాని రోజుకు 10గ్రాముల మోతాదులో తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.