Amala Akkineni: ఏజెంట్ మూవీ ట్రోలింగ్‌పై అమల అక్కినేని కామెంట్.. ఏమన్నారంటే..?
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’పై వస్తున్న ట్రోలింగ్స్ పై అమల అక్కినేని స్పందించారు. సినిమాలో కొన్ని తప్పులు ఉన్నా, తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు.

Amala Akkineni Responds On Agent Movie Trolls
Amala Akkineni: అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, రా ఏజెంట్‌గా అఖిల్ కనిపించాడు. అయితే ఈ సినిమా కోసం అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతడి కష్టం మనకు వెండితెరపై కనిపించింది. కానీ సినిమా కథనం విషయంలో చిత్ర యూనిట్ తప్పటడుగు వేయడంతో ఏజెంట్ మూవీ తొలిరోజే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఏజెంట్ మూవీ చూసిన చాలా మంది ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మీమర్స్, పలు యూట్యూబ్ ఛానల్స్ ఏజెంట్ సినిమాపై పూర్తిగా నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాయి. ఈ ట్రోలింగ్‌పై అమల అక్కినేని తాజాగా స్పందించారు. ఏజెంట్ సినిమాలో కొన్ని తప్పులు ఉన్నా, తాను మూవీని బాగా ఎంజాయ్ చేశానని అమల చెప్పుకొచ్చారు. ఏజెంట్ మూవీని ఓపెన్ మైండ్‌తో చూస్తే బాగా కనెక్ట్ అవుతుందని.. థియేటర్ పూర్తిగా ఆడియెన్స్‌తో నిండిపోగా వారితో కలిసి తాను సినిమా చూశానని.. వారిలో 50 శాతం మహిళలే ఉన్నారని.. వారికి ఈ సినిమా బాగా నచ్చిందిని.. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు వారు కేకలు వేశారని.. అమల చెప్పుకొచ్చారు.
Akhil Akkineni : అక్కినేని కంటే అయ్యగారు అఖిల్.. నాకు ఓకే.. అఖిల్ అక్కినేని!
అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని మరింత జాగ్రత్తగా తీస్తాడని.. ఆ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని అమల పేర్కొన్నారు. ఇలా ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్స్‌కు అమల రెస్పాండ్ కావడంతో ప్రస్తుతం ఈ అంశం వైరల్‌గా మారింది. ఇక ఏజెంట్ మూవీలో అఖిల్ సరసన అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది.
View this post on Instagram