Akhil Akkineni : అక్కినేని కంటే అయ్యగారు అఖిల్.. నాకు ఓకే.. అఖిల్ అక్కినేని!

అక్కినేని అఖిల్ కంటే అభిమానులు అయ్యగారు అఖిల్ అని ఎక్కువగా పిలుస్తుంటారు. దాని పై అఖిల్ రియాక్ట్ అవుతూ..

Akhil Akkineni : అక్కినేని కంటే అయ్యగారు అఖిల్.. నాకు ఓకే.. అఖిల్ అక్కినేని!

Akhil Akkineni comments on his fans called him as ayyagaru

Updated On : April 27, 2023 / 2:42 PM IST

Akhil Akkineni : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచమైన అఖిల్.. మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు ఏజెంట్ (Agent) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రేపు (ఏప్రిల్ 28) ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీని ఆడియన్స్ లోకి తీసుకుని వెళ్లేందుకు ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘అయ్యగారు’ అనే పదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Dhruva – Agent : సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివెర్స్.. చరణ్ అండ్ అఖిల్ సినిమా?

ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక టైటిల్ ఉంటుంది. కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, మెగాస్టార్ చిరంజీవి అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అయితే అఖిల్ అభిమాని ఒకతను అయ్యగారు అని పిలవడం, అది వైరల్ అయ్యి ప్రస్తుతం అఖిల్ కి టైటిల్ అయ్యిపోయింది. దీని పై అఖిల్ రియాక్ట్ అవుతూ.. “నాకు ఇలాంటి టైటిల్ కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే నా అభిమానులు అయ్యగారు అనే టైటిల్ ని బాగా ఇష్టపడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా అక్కినేని అఖిల్ కంటే అయ్యగారు అఖిల్ అనే పిలుస్తుంటారు. కాబట్టి దానిని నేను అంగీకరించాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

Agent – Custody : ఏజెంట్, కస్టడీ చిత్రాల విజయం కోసం.. తిరుమలకు నాగార్జున, అమల..

కాగా ఏజెంట్ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్ గా పరిచయం అవుతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.