Ambani Kids Expensive Supercars: అంబానీ పిల్లలా మజాకా!

ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు ఉండగా వారు స్వతహాగా డ్రైవింగ్ చేయడంతో పాటు వారికి కార్లంటే అమితమైన ప్రేమ.. వీరి దగ్గర ప్రపంచంలోనే టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్న రోల్స్ రాయిస్, బెంట్లీ, టెస్లా, మసెరటి లెవాంటే వంటి కంపెనీల కార్లు ఉండగా.. ముఖేష్ అంబానీ పిల్లలైన ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీ ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు.

Ambani Kids Expensive Supercars: అంబానీ పిల్లలా మజాకా!

Ambani Kids Supercars

Ambani Kids Expensive Supercars: అంబానీ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఒక ఏడాది కిందకి వెళ్లినా.. మరొక ఏడాది పైకి ఎగబాకినా ప్రపంచంలోనే టాప్ టెన్ రిచ్చెస్ట్ పర్సన్స్ లో అంబానీ ఉండాల్సిందే. అంతకు ముందంటే అంబానీ అంటే ఒక్కరే. కానీ ఇప్పుడు ఇద్దరు అంబానీలున్నారు. వారే అంబానీ బ్రదర్స్. వారిలో ముఖేష్ అంబానీ ఆస్తులు ఎంత రెట్టింపు అవుతున్నాయో వారు గడిపే జీవనం కూడా అంతే ఫోష్ గా ఉంటుంది. ముంబైలో నివాసం ఉండే అంబానీ కుటుంబం ఎంత పెద్ద భవంతిని కలిగి ఉందో ఆ ఇంట్లో వాడే వస్తువుల నుండి వారు ఉపయోగించే కార్ల వరకు ప్రతిదీ ప్రత్యేకతే. వీరి విలాసవంతమైన జీవనం గురించి ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా కథనాలు రాగా వీరు వాడే కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి ఉంటాయి.  వాటి కథేంటో ఇప్పుడు మనం చూద్దాం..

అంబానీ ఫ్యామిలీ దగ్గర ప్రధానంగా ఏడు కంపెనీల కార్లు ఉన్నాయి.. వాటిలో..

1. బెంట్లీ బెంటాయిగా

1

Ambani Kids Supercars

ఈ కారు బ్రిటన్ లో తయారవగా.. ఈ కంపెనీ అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తుంది. ఇవి విలాసవంతంగా కారుగా పెట్టింది పేరు. బెంట్లీ బెంటాయిగా కంపెనీకి చెందిన మూడు కార్లు అంబానీ ఇంట్లో ఉండగా.. వీటిలో ఒకటి డబ్ల్యూ 12 ఇంజిన్ సామర్థ్యం కలది కాగా మరొకటి డబ్ల్యూ 8 ఇంజిన్ సామర్థ్యం కలది. ఇక మూడవది భారతదేశంలో మొట్టమొదటి ఫేస్‌లిఫ్ట్ బెంట్లీ బెంటాయిగా. దీని ఖరీదు రూ.14.1 కోట్లు. దీనిని ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ వాడుతుండగా ఇది 5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇది లెఫ్ట్ సీట్ డ్రైవింగ్ కార్.. ఇక ఈ కారు అత్యధిక వేగం 306 కిలోమీటర్లు.

2. డబుల్యు221 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2

Ambani Kids Supercars

అంబానీ బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ఇది ఒకటి. దీనిని అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ వాడతారు. డబుల్యు221 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫోర్ సీటింగ్ కారు. ఇది హోండా సిటీ కారును పోలి ఉంటుండగా.. దీని గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. కేవలం 6.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ ధర విషయానికి వస్తే రూ2.78 కోట్లు ఉంటుంది. ఇందులో రూ.1.41 కోట్ల వేరియంట్ కూడా ఉండగా ఆనంద్ అంబానీ వాడేది మాత్రం రూ.2.78 కోట్ల కారుగా తెలుస్తుంది.

3. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే

3

Ambani Kids Supercars

ముఖేష్ అంబానీ ఈ కారును ఇటీవల కొత్త రంగులతో ఆధునీకరించగా దీనిని కూడా ముఖేష్ రెండో కుమారుడు అనంత్ అంబానీ ఉపయోగిస్తారు. దీనితోనే అతడు తరచూ రేస్ లకు వెళ్తారని తెలుస్తుండగా ఈ కారు ఫోర్ సీటర్ కెపాసిటీ.. 6.75-లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 454 బిహెచ్‌పి శక్తి, 720 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర విషయానికి వస్తే రూ.7.60 కోట్లుగా కాగా దీని అత్యధిక వేగం గంటకు 300 కిలోమీటర్లకు పైనే ఉంటుంది.

4. రేంజ్ రోవర్ వోగ్

4

Ambani Kids Supercars

సహజంగా రేంజ్ రోవర్ కార్లంటే సినీ నటులు మక్కువ ఎక్కువ. చాలామంది బాలీవుడ్ నటీనటులు రేంజ్ రోవర్ కార్లను వాడుతుండగా.. టాలీవుడ్ లో కూడా పలువురికి ఈ కార్లు ఉన్నాయి. ఇక అంబానీ ఇంట్లో డజనుకు పైగానే రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయంటే ఆ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ రేంజ్ రోవర్ కార్లను కుటుంబ సభ్యులు అందరు నడుపుతారు. ఇక వీటి ధర విషయానికి వస్తే వేరియంట్ ను బట్టి. రూ. 60 లక్షల నుంచి రూ .3.47 కోట్ల వరకు ఉండగా అంబానీ కాన్వాయ్ లో ఈ రేంజ్ రోవర్ కార్లే అధికంగా దర్శనమిస్తాయి.

5. మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి

5

Ambani Kids Supercars

ఇది అనంత్ అంబానీ యొక్క ఆఫ్-రోడ్ కారు. ఈ కారు అధునాతన 7-స్పీడ్, జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్, పెద్ద విండ్‌స్క్రీన్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు కలిగి ఉంది. 5.5-లీటర్ బిటుర్బో పెట్రోల్ ఇంజిన్‌ కలిగిన ఈ కారు గరిష్ట శక్తి 544 బిహెచ్‌పి, 760 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకొనే సామర్ధ్యం కలిగి ఉండగా దీని ధర రూ. 2.42 కోట్లు.

6. బీఎండబుల్యు i8

6

Ambani Kids Supercars

ఇది స్పోర్ట్స్ కారు. అంబానీ గ్యారేజ్ లో ఉన్న అద్భుతమైన కార్లలో ఇది ఒకటి. దీనిని కూడా అనంత్ అంబానీ నడుపుతారు. పెట్రోల్ ఇంజిన్, ఎలెక్ట్రిక్ మోటార్ ల కలయిక ఈ కారు. ఇది ఫోర్ యాక్సిల్ కారు. అంటే నాలుగు చక్రాలకు ఇంజన్ నుండి తిరిగే సామర్ధ్యం ఉంటుంది. 1.5-లీటర్, 3-సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ కారు అత్యధిక వేగం గంటకు 210 కిలోమీటర్లు కాగా 6 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. 235 పీఎస్, 320 ఎన్ఎంను ఉత్పత్తి చేస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే రూ.2.62 కోట్లు కాగా ఇది సెడాన్ వేరియంట్.

7. లంబోర్ఘిని ఉరుస్

7

Ambani Kids Supercars

ఇది సూపర్ స్పోర్ట్స్ కారు. ఇంకా చెప్పాలంటే ఇది అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కారు. ఈ కారును వైల్డ్ ఆక్స్ అని పిలుస్తారు. ఇది ఎస్యూవీ. దేశంలో అంబానీ కుటుంబమే మొదటిసారి ఈ కారును కొనుగోలు చేయగా దీనిని ముఖేష్ పెద్దకొడుకు ఆకాష్ అంబానీ నడుపుతారు. దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు. అత్యధిక శబ్దం చేసే స్పోర్ట్స్ కార్ ఇదే కాగా దీని ధర విషయానికి వస్తే రూ.3.15 కోట్ల నుంచి 3.43 కోట్ల మధ్య ఉంటుంది. ఆకాష్ రేసింగ్ లో దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కారులోనే ఆకాష్ అంబానీతో కలిసి ఓ సారి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రయాణించారు. ఈ కారు 641 Bhp శక్తిని మరియు 850 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుండగా ఈ కారంటే మొత్తం అంబానీ కుటుంబానికే ముక్కవగా చెప్పుకుంటారు.