Coal Shortage : రంగంలోకి అమిత్ షా..బొగ్గు ,విద్యుత్ శాఖ మంత్రులతో భేటీ

దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బొగ్గు కొరత కారణంగా వివిధ రాష్ట్రాల్లో

Coal Shortage : రంగంలోకి అమిత్ షా..బొగ్గు ,విద్యుత్ శాఖ మంత్రులతో  భేటీ

Amith (2)

Coal Shortage   దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బొగ్గు కొరత కారణంగా వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తిన క్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు.

విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ అధికారులు కూడా అమిత్ షా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా, విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు,ఇతర సంబంధిత సవాళ్లపై అధికారులతో అమిత్ షా చర్చించారు.

కాగా,ఈ ఏడాది నమోదైన భారీ వర్షాల కారణంగా గుజరాత్, పంజాబ్, రాజస్తాన్,ఢిల్లీ, తమిళనాడు.. తదితర రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు అంతరాయం కలిగింది. అయితే, దేశ రాజధానితోపాటు ఇతర నగరాల్లో తక్షణం ఏర్పడే విద్యుత్ అంతరాయాల భయాలను తొలగించడానికి విద్యుత్ ప్లాంట్ల డిమాండ్‌ను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ప్రస్తుత ఇంధన నిల్వ దాదాపు 7.2 మిలియన్ టన్నులు ఉందని, నాలుగు రోజులకు సరిపోతాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ దిగ్గజం కోల్ ఇండియాలో 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వ ఉన్నాయని, ఇవి విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం పూర్తిగా తప్పని కేంద్రం ప్రకటించింది.

బొగ్గు క్షేత్రాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ..CIL ఈ సంవత్సరంలో విద్యుత్ రంగానికి 255 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును సరఫరా చేసిందని, ఇది అత్యధిక సరఫరా అని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని వనరుల నుండి మొత్తం బొగ్గు సరఫరాలో…. ప్రస్తుతం CIL నుండి విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా రోజుకు 14 లక్షల టన్నులకు పైగా ఉంది మరియు తగ్గుతున్న వర్షాలతో ఈ సరఫరా ఇప్పటికే 15 లక్షల టన్నులకు పెరిగింది మరియు అక్టోబర్ 2021 చివరి నాటికి రోజుకి 16 లక్షల టన్నులకి పైగా పెంచడానికి సిద్ధంగా ఉందని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది. SCCL మరియు క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల నుండి ప్రతిరోజూ మరో 3 లక్షలకు పైగా టన్నుల బొగ్గు సరఫరా చేయబడుతుందని తెలిపింది.

ALSO READ  ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం..నాలుగు ప్రధాన కారణాలు ఇవే