Coal Shortage : ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం..నాలుగు ప్రధాన కారణాలు ఇవే

బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు కరెంట్ సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. విద్యుత్ కేంద్రాలు...పవర్ ఉత్పత్తి చేయడానికి తగినంత బొగ్గు

Coal Shortage : ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం..నాలుగు ప్రధాన కారణాలు ఇవే

Power

Coal Shortage   బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు కరెంట్ సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. విద్యుత్ కేంద్రాలు…పవర్ ఉత్పత్తి చేయడానికి తగినంత బొగ్గు నిల్వలు కలిగి ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం తాను చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఢిల్లీలోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విద్యుత్ సరఫరా చేసే యూనిట్‌లతో సహా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వల పరిస్థితిని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ ఆదివారం సమీక్షించారు. పవర్ ప్లాంట్లకు తగినంత ఇంధనం అందించబడుతున్నందున దేశ రాజధాని ఎటువంటి విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోదని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు, డిమాండ్‌ను తీర్చడానికి దేశంలో పుష్కలంగా బొగ్గు అందుబాటులో ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం అక్కర్లేదని బొగ్గు మంత్రిత్వశాఖ చెబుతోంది.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. పవర్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు ప్రధాన కారణాలు 
1. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కారణంగా భారీగా విద్యుత్ డిమాండ్‌ పెరుగుదల
2. ఈ ఏడాది సెప్టెంబరులో బొగ్గు గని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం తద్వారా బొగ్గు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం, గనుల నుండి బొగ్గును సరఫరా చేయడంలో ఇబ్బందులు
3. దిగుమతి  బొగ్గు ధరలు భారీగా పెరగడం.. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. ఇది దేశీయ బొగ్గుపై ఎక్కువ ఆధారపడటానికి దారితీసింది.
4. వర్షాకాలం ప్రారంభానికి ముందు తగినంత బొగ్గు నిల్వలను ఉంచుకోలేకపోవడం

వీటితో పాటు..మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ మరియు మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల నుండి బొగ్గు కంపెనీల భారీ బకాయిల సమస్యలు కూడా ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభానికి దోహదం చేసిన మరొక అంశం ఏమిటంటే.. విద్యుత్ ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించిన పవర్ ప్లాంట్లు,అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఉత్పత్తిని తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడం వలన రాష్ట్రాలకు నిర్దిష్ట రేటులో పవర్ ను అందించడం పవర్ కంపెనీలకు కష్టతరం అయింది.

పడిపోయిన బొగ్గు దిగుమతులు
దేశీయ కొరతను తీర్చడానికి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి అనేది ఖచ్చితంగా ఒక ఆప్షన్ గా ఎప్పుడూ ఉంటుంది. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ లేదా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో అన్ని దేశాలు ఇంధన వనరులను భద్రపరిచేందుకు అదనపు ఆసక్తి చూపడం..ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇండోనేషియా బొగ్గు దిగుమతి ధర మార్చి-2021 లో ఒక టన్ను 60 డాలర్లు ఉండగా.. సెప్టెంబర్ నాటికి అదికి 160 డాలర్లకు పెరిగింది. దిగుమతే ప్రత్యామ్నాయం కావడం మరియు దిగుమతి బొగ్గు ధరలు భారీగా పెరగడం వల్ల.. 2019-20తో పోలిస్తే బొగ్గు దిగుమతి తగ్గింది. ఆస్ట్రేలియా నాన్-కుకింగ్ బొగ్గు ఒక టన్ను ధర 200 డాలర్ల కంటే ఎక్కువకి పోతుంది.

చైనా నిర్ణయం కూడా ఒక కారణం
ఇటీవల చైనాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు మరియు వరదల కారణంగా చైనాలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం… 27 గనుల వద్ద ఉత్పత్తిని నిలిపివేసింది. దీనివల్ల దేశాన్ని పట్టి పీడిస్తున్న ఇంధన సంక్షోభానికి మరింత ఒత్తిడి తోడయ్యింది. ప్రపంచంలో బొగ్గును భారీ ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా ఒకటి. అదేవిధంగా వినియోగంలో కూడా చైనానే ముందువరుసలో ఉంటుంది.

పునరుత్పాదక ఉత్పత్తులలో(Renewables) తగినంత పెరుగుదల లేకపోవడం మరియు న్యాచురల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం కూడా ప్రపంచ ఇంధన సంక్షోభానికి కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని ఇంధన వనరులను ఏ ధరకైనా భద్రపరచాలన్న చైనా నిర్ణయం… ప్రపంచ మార్కెట్లో కొరతను సృష్టిస్తుంది మరియు ధరలు భారీగా పెరుగడానికి కారణమవుతోంది.

భారత్ లో బొగ్గు నిల్వల స్థాయిని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమీక్షించిన తర్వాత…అక్టోబర్-9న మొత్తం బొగ్గు సరఫరా అన్ని వనరుల నుండి(కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కొల్లరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్ మైన్స్ మరియు దిగుమతి చేసుకున్న బొగ్గు)19.2 లక్షల టన్నులగా ఉండిందని..అయితే మొత్తం వినియోగం 18.7 లక్షల టన్నులుగా ఉండిందని విద్యుత్ శాఖ తెలిపింది.

క్రమంగా బొగ్గు నిల్వను పెంచుకోవడాన్ని ఇది సూచిస్తుందని తెలిపింది. పవర్ ప్లాంట్ ల వద్ద బొగ్గు నిల్వను పెంచడం 4 రోజుల కంటే ఎక్కువ అవసరానికి సరిపోతుంది మరియు కోల్ ఇండియా లిమిటెడ్(CIL) ద్వారా బొగ్గు సరఫరా పెరుగుతున్నందున..పవర్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వ క్రమంగా మెరుగుపడుతుంది.

బొగ్గు మంత్రిత్వ శాఖ మరోక ప్రకటనలో… పవర్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వ దాదాపు 72 లక్షల టన్నులు ఉందని,నాలుగు రోజుల అవసరానికి ఇది సరిపోతుందని మరియు కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) 400 లక్షల టన్నుల కంటే ఎక్కువ నిల్వలను కలిగి ఉందని.. ఇది విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరఫరా చేయబడుతోందని తెలిపింది.

బొగ్గు సరఫరా లోటు
బొగ్గు కంపెనీల నుండి బలమైన సరఫరా ఆధారంగా ఈ ఏడాది (సెప్టెంబర్ 2021 వరకు) దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి దాదాపు 24 శాతం పెరిగింది. విద్యుత్ ప్లాంట్లలో… రోజువారీ సగటు బొగ్గు అవసరం దాదాపు 18.5 లక్షల టన్నులు కాగా, రోజువారీ బొగ్గు సరఫరా దాదాపు 17.5 లక్షల టన్నులు. ఆగస్టు-సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసినప్పటికీ,ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దేశీయ బొగ్గు సరఫరా విద్యుత్ ప్లాంట్ల నిర్వహణను నిలబెట్టగలిగింది మరియు డిస్కామ్‌లకు వారి అవసరాలకు అనుగుణంగా పూర్తి విద్యుత్ సరఫరాకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బొగ్గు క్షేత్రాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ..CIL ఈ సంవత్సరంలో విద్యుత్ రంగానికి 255 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును సరఫరా చేసిందని, ఇది అత్యధిక సరఫరా అని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని వనరుల నుండి మొత్తం బొగ్గు సరఫరాలో…. ప్రస్తుతం CIL నుండి విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా రోజుకు 14 లక్షల టన్నులకు పైగా ఉంది మరియు తగ్గుతున్న వర్షాలతో ఈ సరఫరా ఇప్పటికే 15 లక్షల టన్నులకు పెరిగింది మరియు అక్టోబర్ 2021 చివరి నాటికి రోజుకి 16 లక్షల టన్నులకి పైగా పెంచడానికి సిద్ధంగా ఉందని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది. SCCL మరియు క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల నుండి ప్రతిరోజూ మరో 3 లక్షలకు పైగా టన్నుల బొగ్గు సరఫరా చేయబడుతుందని తెలిపింది.

భారీ వర్షాలు, తక్కువ బొగ్గు దిగుమతులు మరియు ఆర్థిక రికవరీ కారణంగా విద్యుత్ డిమాండ్ బాగా పెరిగినప్పటికీ.. దేశీయ బొగ్గు సరఫరా విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన మార్గంలో సపోర్ట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు సరఫరాలు నమోదవుతాయని భావిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో లో బొగ్గు ధర భారీగా ఉన్న కారణంగా..దిగుమతి ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఒప్పందాల కింద కూడా విద్యుత్ సరఫరా దాదాపు 30 శాతం తగ్గింది. దిగుమతి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు..45.7 బిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 25.6 బిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశాయి.

ఈ సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్‌లో దేశీయ ఆధారిత విద్యుత్ సరఫరా దాదాపు 24 వరకు పెరిగింది. దేశంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాతో పాటు అల్యూమినియం, సిమెంట్, స్టీల్ మొదలైన విద్యుత్ యేతర పరిశ్రమల డిమాండ్‌ను తీర్చడానికి CIL ప్రతిరోజూ 2.5 లక్షల టన్నులకు పైగా సరఫరా చేస్తున్నందున… దేశంలో బొగ్గు కొరత మరియు విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశం లేదని కేంద్రం చెబుతోంది.

ALSO READ  కరెంట్ కోతలు తప్పవ్..ఎంత తక్కువ వాడితే అంత మంచిది : మంత్రి సజ్జల

ALSO READ దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి -చంద్రబాబు