Chandrababu: దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి -చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

Chandrababu: దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి -చంద్రబాబు

Cbn

Chandrababu: తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నట్లు చెప్పారు చంద్రబాబు. జగన్ రెడ్డి అంతా నాశనం చేశారని, బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారని అన్నారు చంద్రబాబు. విద్యుత్ విషయంలో తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని నిలదీశారు చంద్రబాబు. హౌస్ సైట్స్ విషయంలో వైసీపీ నేతలే కోర్టులో పిటిషన్లు వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారని అన్నారు చంద్రబాబు.

ఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా పెట్టారని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 98 లక్షల మందికి సమానంగా లబ్ధి చేకూర్చగా జగన్ రెడ్డి ప్రభుత్వం 78 లక్షల మందికే లబ్ధి చేకూర్చిందని చెప్పారు. ఆషి ట్రేడింగ్ కంపెనీతో డ్రగ్స్ మాఫియా వేలకోట్ల రూపాయల డ్రగ్స్ రాష్ట్రంలోకి తీసుకుని వచ్చిందని, ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె నిక్ నేమ్ కాదా? అని ప్రశ్నించారు.

గంజాయి, హెరాయన్, ఎర్రచందనం, తలనీలాల స్మగ్లర్లకు పెద్దపీట వేయడమే జగన్ రెడ్డి విధానంగా కనిపిస్తుందని విమర్శించారు చంద్రబాబు. ఇప్పటికే రూ.6 లక్షల కోట్లు అప్పులు చేశారని, పెద్దఎత్తున అప్పులు చేస్తూ.. ఆ డబ్బుతో అవినీతి, దుబారా చేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాలు అన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, జీతాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, పెన్షన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాని టార్గెట్ చేసుకుని కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్ రెడ్డి కుట్రపన్నుతున్నారని అన్నారు చంద్రబాబు.