Ananya Nagalla : తమిళ్‌లో ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్‌సాబ్’ భామ

తాజాగా అనన్య తమిళ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ్ లో హీరో శశికుమార్‌ సరసన నటిస్తుంది. టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాని డైరెక్టర్ తంగం పా శరవణన్............

Ananya Nagalla :  తమిళ్‌లో ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్‌సాబ్’ భామ

Ananya Nagalla

Updated On : February 16, 2022 / 11:22 AM IST

Ananya Nagalla :   తెలుగులో ‘మల్లేశం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ అనన్య నాగళ్ల తర్వాత వకీల్‌సాబ్‌ సినిమాతో పాపులర్ అయింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించింది. సినిమాల్లో చాలా సైలెంట్ గా, చాలా పద్దతిగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ చాలా హోమ్లీగా కనపడుతుంది. కెరీర్ మొదట్లో తన సోషల్ మీడియాలో కూడా చాలా హోమ్లీగా ఫోటోలు పెట్టేది. కానీ ఇటీవల డోసు పెంచింది. అదిరిపోయే ఫొటోలతో అందాలని ప్రదర్శిస్తూ కుర్రకారుకి హీటెక్కిస్తోంది అనన్య నాగళ్ళ. ఇటీవల తన ఫొటో షూట్స్ తో మరింత పాపులర్ అయింది.

Naveen Chandra : వైఫ్‌తో ఫస్ట్ టైం ఫోటో షేర్ చేసిన నవీన్ చంద్ర.. నవీన్ చంద్ర వైఫ్‌ని చూశారా?

తాజాగా అనన్య తమిళ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ్ లో హీరో శశికుమార్‌ సరసన నటిస్తుంది. టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాని డైరెక్టర్ తంగం పా శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని అనన్య తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనుంది.