Naveen Chandra : వైఫ్‌తో ఫస్ట్ టైం ఫోటో షేర్ చేసిన నవీన్ చంద్ర.. నవీన్ చంద్ర వైఫ్‌ని చూశారా?

నవీన్‌ చంద్ర కూడా ఇప్పటివరకు ఎక్కడా తన పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడలేదు. తాజాగా ఫిబ్రవరి 14, వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చారు నవీన్ చంద్ర......

Naveen Chandra :  వైఫ్‌తో ఫస్ట్ టైం ఫోటో షేర్ చేసిన నవీన్ చంద్ర.. నవీన్ చంద్ర వైఫ్‌ని చూశారా?

Naveen Chandra

Updated On : February 16, 2022 / 11:05 AM IST

Naveen Chandra :  ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్‌ చంద్ర తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయ్యాడు. ఇటీవల ఓటీటీలలో వరుస సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ స్టార్ అయ్యాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం నవీన్ చంద్ర చేతినిండా సినిమాలతో, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. అయితే చాలా మందికి నవీన్ చంద్రకి పెళ్లి అయిందని తెలిసినా అతని వైఫ్ ఎవరు, ఎలా ఉంటారు అని ఎవ్వరికి తెలీదు.

Mohan Babu : ఇండస్ట్రీకి పెద్దన్న ఆయనే.. మోహన్ బాబుపై నరేష్ వ్యాఖ్యలు

నవీన్‌ చంద్ర కూడా ఇప్పటివరకు ఎక్కడా తన పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడలేదు. తాజాగా ఫిబ్రవరి 14, వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చారు నవీన్ చంద్ర. వ్యాలెంటైన్స్ డే రోజు తన భార్యతో ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.. ”ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్‌ డే వైఫీ. నా బెటర్‌ హాఫ్‌ ఓర్మా’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేయడం గమనార్హం. దీంతో నవీన్ చంద్ర తన భార్యతో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.