Mohan Babu : ఇండస్ట్రీకి పెద్దన్న ఆయనే.. మోహన్ బాబుపై నరేష్ వ్యాఖ్యలు

ఈ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. ''తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న మోహన్ బాబే. ఇండస్ట్రీకి పెద్ద మాత్రమే కాదు మా అందరికి అన్న, అందరికంటే మిన్న మోహన్‌ బాబు. ఇండస్ట్రీలో గొప్ప..........

Mohan Babu :  ఇండస్ట్రీకి పెద్దన్న ఆయనే.. మోహన్ బాబుపై నరేష్ వ్యాఖ్యలు

Mohan Babu

Mohan Babu :  ఇటీవల ఇండస్ట్రీ పెద్ద అనే అంశంపై బాగా చర్చ జరుగుతుంది. ఒకపక్క చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యలని తన భుజాలపై వేసుకొని వాటిని పరిష్కరించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ఆయన నాకు ఇండస్ట్రీ పెద్ద అనే పేరు వద్దు కానీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే ముందుంటాను అని చెప్పారు అలాగే చేస్తున్నారు. ఇక మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అని కొంతమంది గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటివరకు సినిమా సమస్యలపై స్పందించలేదు కానీ ఆయన కూడా నేనే పెద్ద అని ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పుకున్నారు. ఆయన తనయుడు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఇదే అన్నారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ మళ్ళీ వీటిపై వ్యాఖ్యలు చేయడం విశేషం.

మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ లీడ్ రోల్ లో సినిమా చేస్తున్నారు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో మంచు విష్ణు నిర్మాణంలో మోహన్ బాబు హీరోగా ‘సన్ ఆఫ్ ఇండియా’ తెరకెక్కింది. ఈ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నిన్న మంచు విష్ణు సీఎం జగన్ ని కలవడం, మీడియాతో మాట్లాడటం, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi : బప్పి లహరి మరణంపై మెగాస్టార్ ట్వీట్

ఈ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. ”తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న మోహన్ బాబే. ఇండస్ట్రీకి పెద్ద మాత్రమే కాదు మా అందరికి అన్న, అందరికంటే మిన్న మోహన్‌ బాబు. ఇండస్ట్రీలో గొప్ప హీరోలున్నారు, గొప్ప విలన్లు ఉన్నారు. గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అవన్నీ కలిసిన ఒకే వ్యక్తి మోహన్‌ బాబు. ఆయనకు ఆయనే సాటి. రైతు కుటుంబంలో పుట్టి, కష్టపడి ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నాయకుడు మోహన్‌ బాబు. ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదు, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి” అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నరేష్‌ వ్యాఖ్యలు టాలీవుడ్‌ లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.