NTR 30 : ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్..

అనిరుధ్ రవి చంద్రన్.. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. కానీ టాలీవుడ్‌లో స్ట్రయిట్ మూవీతో సక్సెస్ కొట్టలేకపోయాడు..

NTR 30 : ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్..

Anirudh To Compose Music For Jr Ntr 30

NTR 30: భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ సినిమాలకి.. టెక్నీషియన్స్ సెట్ చేయడమన్నది చిన్న విషయం కాదు. అందుకే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు మేకర్స్. అలా థింక్ చేసే.. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ కోసం ఓ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌ని రంగంలోకి దించుతున్నారు. మరి తెలుగులో సక్సెస్ రేట్ అంతంతమాత్రమే ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్టీఆర్‌కి హిట్ ఇస్తాడా..?

అనిరుధ్ రవి చంద్రన్.. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ టాలీవుడ్‌లో స్ట్రయిట్ మూవీతో సక్సెస్ కొట్టలేకపోయాడు. అయినా ఎన్టీఆర్ 30తో మరోసారి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కొరటాల శివ – తారక్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మూవీకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. థమన్, దేవీ శ్రీ ప్రసాద్, మణిశర్మలను కాదనుకొని అనిరుధ్‌కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. అంతేకాదు అనిరుధ్ కూడా తెలుగులో బిగ్గెస్ట్ బ్రేక్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వచ్చే సినిమా.. అది ఎన్టీఆర్ 30వ సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అలాంటింది మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌ని సెలెక్ట్ చేసుకోవడంతో డైలామాలో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. ఎందుకంటే అనిరుధ్ కంపోజ్ చేసిన ‘అజ్ఞాతవాసి’ సూపర్ ఫ్లాప్‌గా నిలిచింది. నాని ‘గ్యాంగ్ లీడర్’ సోసో అనిపించుకోగా.. ‘జెర్సీ’ పర్వాలేదనిపించుకుంది.. అయితే ఈ సినిమాల్లో మాస్ పాటలుండవు. కానీ తారక్ సాంగ్స్ అంటే ఖచ్చితంగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయాలి. అందుకే అనిరుధ్ ఎలా డీల్ చేస్తాడా అని తెగ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ .

నిజానికి ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అరవింద సమేత’ కు అనిరుధ్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ లాస్ట్ మినిట్‌లో ఆ ఆఫర్ థమన్ తలుపు తట్టింది. అది మిస్సయినా ఎన్టీఆర్ 30వ సినిమాకి ఛాన్స్ దక్కించుకున్నాడు అనిరుధ్. ఇక ఈ మూవీ రిజల్ట్‌పైనే అనిరుధ్ టాలీవుడ్ కెరీర్ డిపెండ్ అయి ఉంది. తమిళ్‌లో ఎంత పెద్ద మ్యూజికల్ హిట్స్ ఉన్నా.. టాలీవుడ్‌లో సరైన హిట్ పడితేనే తెలుగు హీరోల సినిమాల్లో నెక్ట్స్ అవకాశం వస్తుంది. మరి ఎన్టీఆర్ ఇస్తోన్న ఈ ఛాన్స్‌తో అనిరుధ్ ఫేట్ మారుతుందా.. లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చెయ్యాల్సిందే..