Mahesh Babu: మహేష్ చేతికి మరో బ్రాండ్.. ఏడాదికి రూ.15 కోట్లు?

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను కొందరు సినిమా వాళ్ళు తూచాతప్పకుండా పాటిస్తూ గట్టిగా వెనకేసుకుంటున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్..

Mahesh Babu: మహేష్ చేతికి మరో బ్రాండ్.. ఏడాదికి రూ.15 కోట్లు?

Mahesh Babu

Updated On : December 4, 2021 / 3:22 PM IST

Mahesh Babu: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను కొందరు సినిమా వాళ్ళు తూచాతప్పకుండా పాటిస్తూ గట్టిగా వెనకేసుకుంటున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. ఒకవైపు వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మహేష్ మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో కూడా అంతే బిజీగా ఉంటాడు. ఇప్పటికే థంప్స్‌అప్‌, అభి బస్‌, ఐడియా, సంతూర్‌, ప్యారగాన్ తదితర వాణిజ్య ప్రకటనలో కనిపించే మహేష్ ఖాతాలో ఇప్పుడు మరో కంపెనీ కూడా చేరింది.

Bigg Boss 5: మళ్ళీ హౌస్‌లోకి రవి రీఎంట్రీ.. నిజమెంత?

తాజాగా ఒక సాఫ్ట్ డ్రింక్స్ మౌంటెన్ డ్యూకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు మహేష్. ట్విటర్‌ వేదికగా ప్రకటించిన మహేష్ ‘లెట్స్‌ డ్యూ ఇట్‌’ అంటూ పోస్ట్ చేశారు. అమెరికాకు చెందిన బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీకో ఉత్పాదనల్లో మౌంటెన్ డ్యూ డ్రింక్ కూడా ఒకటి కాగా ఇది పలు దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు తెలుగులో మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కి అక్కినేని అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా తాజాగా ఇప్పుడు మహేష్ బాబు అఖిల్ స్థానాన్ని ఆక్రమించాడు.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

మౌంటెన్ డ్యూకు నార్త్ లో హృతిక్ రోషన్ ప్రచార కర్త కాగా.. దక్షణాదిన అన్ని బాషలకు కలిపి ఇప్పుడు మహేష్ న ఎంచుకుంది. కాగా.. ఏడాదికి చేసుకున్న ఈ ఒప్పందానికి గాను మహేష్ కు మౌంటెన్ డ్యూ ఏకం రూ15 కోట్లు చెల్లించినట్లు టాక్ నడుస్తుంది. భ‌యాల‌ను ప‌క్క‌న పెట్టి, స‌వాళ్ల‌ను అధిగ‌మించి రిస్క్ తీసుకుంటేనే పేరు వ‌స్తుంది అనే ట్యాగ్ లైన్‌తో వ‌చ్చే మౌంటైయిన్ డ్యూ వాణిజ్య ప్ర‌క‌ట‌న యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా సాగుతుంది.

https://twitter.com/urstrulyMahesh/status/1466708338100428800?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1466708338100428800%7Ctwgr%5Ehb_0_7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fmahesh-babu-new-brand-ambassador-mountain-dew-1416783