Adipurush : ఆదిపురుష్ పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కామెంట్స్.. ప్రజల విశ్వాసాలను దెబ్బతియ్యడం..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసాలను దెబ్బ తియ్యడాని..

Adipurush : ఆదిపురుష్ పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కామెంట్స్.. ప్రజల విశ్వాసాలను దెబ్బతియ్యడం..

Anurag Thakur comments on Prabhas Om Raut Adipurush controversy

Anurag Thakur – Adipurush : రామాయణ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది అంటూ ప్రజలు నుంచి పాలకులు వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా స్పందించారు.

Adipurush Controversy : ఆదిపురుష్ చిత్రం ఆపేయాలంటూ ర‌చ్చ‌.. ప్రేక్ష‌కుల‌ను బ‌య‌ట‌కు వెళ్లిపోమ‌ని..

ప్రజల విశ్వాసాలను దెబ్బ తియ్యడాని తాము అంగీకరించమని, అటువంటి చర్యలకు తాము ఎప్పుడు వ్యతిరేకమని తెలియజేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమాలోని ఇబ్బందికరమైన డైలాగ్స్‌ను మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని అనురాగ్‌ ఠాకూర్‌ కూడా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీ ఎంపీ కూడా దీని పై స్పందించారు. తానూ ఇంకా సినిమా చూడలేదని, కానీ సినిమాలోని కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిసిందే. చిత్ర బృందం దాని పై స్పందించి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులు భవిషత్తులో ఇలాంటి కథలు తెరకెక్కించేటప్పుడు జాగ్రత్త వ్యవహరించాలని పేర్కొన్నారు.

Adipurush : ఆదిపురుష్ పై ముఖేష్ ఖన్నా ఆగ్రహం.. రామాయణంకి ఇంతకంటే పెద్ద అగౌరవం లేదు..

ఈ సినిమాకి డైలాగ్స్ రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్ల రాశారు. దేవులతో ఇబ్బందికర రీతిలో డైలాగ్స్ చెప్పించడం అందరి ఆగ్రహాన్ని ఎదురుకునేలా చేసింది. ముఖ్యంగా హనుమంతుడు పాత్రతో చెప్పించిన మాటలు పై తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. ఇక దీని పై రైటర్ మనోజ్ ముంతాషీర్ స్పందించి.. డైలాగ్స్ మారుస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని మోడరన్ కల్చర్ కి తగ్గట్టు చూపించే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ సినిమాల ప్రేరణతో సినిమాని తెరకెక్కించారు మేకర్స్. అయితే రామాయణం అనేది ప్రజల విశ్వాసంతో కూడుకున్నది కావడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది.