Adipurush Controversy : ఆదిపురుష్ చిత్రం ఆపేయాలంటూ ర‌చ్చ‌.. ప్రేక్ష‌కుల‌ను బ‌య‌ట‌కు వెళ్లిపోమ‌ని..

రాముడిగా ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన సినిమా ‘ఆదిపురుష్‌'(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సీత‌గా కృతి స‌న‌న్((Kriti Sanon), సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా క‌నిపించారు.

Adipurush Controversy : ఆదిపురుష్ చిత్రం ఆపేయాలంటూ ర‌చ్చ‌.. ప్రేక్ష‌కుల‌ను బ‌య‌ట‌కు వెళ్లిపోమ‌ని..

Nalasopara

Adipurush : రాముడిగా ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన సినిమా ‘ఆదిపురుష్‌'(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సీత‌గా కృతి స‌న‌న్((Kriti Sanon), సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా క‌నిపించారు. ఈ సినిమా శుక్ర‌వారం (జూన్ 16)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన నాటి నుంచే వివాదాల మ‌యంగా మారింది. కొన్ని చోట్ల ఈ చిత్రాన్ని నిషేదించాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. చిత్ర‌బృందం ఎంత స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికి వివాదాలు మాత్రం ఆగ‌డం లేదు.

ఇదిలా ఉంటే ఆదివారం మ‌హారాష్ట్రంలోని పాల్ఘ‌ర్ ప్రాంతంలోని ఓ మ‌ల్టీప్లెక్స్‌లో ఆదిపురుష్ సినిమా ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా హిందూ సంస్థ‌లకు చెందిన కొంద‌రు స‌భ్యులు అక్క‌డ‌కు చేరుకున్నారు. నానా ర‌చ్చ చేశారు. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రేక్ష‌కుల‌ను హాల్ నుంచి వెళ్లిపోవాల‌ని కోరారు. మ‌ల్టీపెక్స్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన నలసోపరాలో చోటుచేసుకుంది.

Adipurush : ఆదిపురుష్ పై ముఖేష్ ఖన్నా ఆగ్రహం.. రామాయణంకి ఇంతకంటే పెద్ద అగౌరవం లేదు..

‘మీ పిల్లలకు ఇది నేర్పిస్తారా.. మాకు సిగ్గుగా ఉంది.. మా దేవుళ్లను అవమానిస్తే తట్టుకోలేకపోతున్నాం’ అని ఓ వ్యక్తి చెప్పడం వీడియోలో వినిపించింది. మ‌ల్టీప్లెక్స్ సిబ్బంది వారిని శాంతించేందుకు ప్ర‌య‌త్నించారు. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు అడ్డం రాకుండా హాల్ బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడుకుందాం అంటూ వారికి న‌చ్చ‌జెప్పె ప్ర‌య‌త్నం చేయ‌గా ఇందుకు వారు నిరాక‌రించారు. ఏదైనా స‌రే ఇక్క‌డే మాట్లాడుకుందాం. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆఖ‌ర‌కు నిర‌స‌న‌కారులు “జై శ్రీరామ్” అని నినాదాలు చేస్తూ హాల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌గా కొంద‌రు ప్రేక్ష‌కులు సినిమా చూడ‌కుండానే వెళ్లిపోయారు.

Adipurush : ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌లో పఠాన్ రికార్డుని బ్రేక్ చేసిన ఆదిపురుష్.. ప్రభాస్ రేంజ్ అంటున్న ఫ్యాన్స్!

ఖాట్మండులో ఆదిపురుష్ బ్యాన్‌

నేపాల్‌లోని ఖాట్మండులో ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ సినిమాలో సీతాదేవిని భార‌త దేశానికి చెందిన వ్యక్తిగా చూపించ‌డం, డైలాగులు కూడా అలాగే ఉండ‌డంతో నేపాల్ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని ఖాట్మండు న‌గ‌ర మేయ‌ర్ బాలెన్ షా తెలిపారు. అభ్యంత‌ర స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని చిత్ర బృందానికి మూడు రోజుల స‌మ‌యం ఇచ్చారు. అయితే.. చిత్ర‌బృందం స్పందించ‌క‌పోవ‌డంతో సినిమాను బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆదిపురుష్ చిత్రంలోని డైలాగ్‌లు మార్చేవ‌ర‌కు ఆదిపురుష్ సినిమా మాత్ర‌మే కాదు ఏ భార‌తీయ సినిమా ఖాట్మండులో విడుద‌ల అవ్వ‌దు అని అన్నారు.

Adipurush Controversy : ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌పై మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌లు కోరితే రాష్ట్రంలో సినిమాని నిషేదిస్తాం