Ap Online Movie Tickets : సినిమా టికెట్ల అమ్మకం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

సినిమా టికెట్లు ఆన్లైన్ లో అమ్ముతాము అన్న ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో లాంటి సైట్స్ లో.......

Ap Online Movie Tickets : సినిమా టికెట్ల అమ్మకం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

Ap Movie Tickets

Ap Online Movie Tickets :  సినిమా టికెట్లు ఆన్లైన్ లో అమ్ముతాము అన్న ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో లాంటి సైట్స్ లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. అయితే ఇందులో సర్వీస్ ఛార్జ్ పేరుతో ఒక్కో టికెట్ కి థియేటర్ రేంజ్ ని బట్టి 19 నుంచి 25 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుడికి అదనపు భారం పడుతుంది.

ఈ దోపిడీని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ అమ్మెందుకు సొంత ఆన్లైన్ పోర్టల్ తీసుకొచ్చి అందులో కేవలం 2 రూపాయల సర్వీస్ ఛార్జ్ మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. అయితే ఈ పోర్టల్ వస్తే బుక్ మై షో లాంటి యాప్స్ కి భారీ నష్టం వస్తుంది. అంతే కాకుండా బుక్ మై షో వసూలు చేసే చార్జీలతో కొంత థియేటర్లకు కూడా చెల్లిస్తుండటంతో అవి కూడా బుక్ మై షోకి వత్తాసు పలుకుతున్నాయి.

Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??

సినిమా ఆన్లైన్ టికెట్స్ జీవో 69 నిలుపుదల చేయాలని బుక్ మై షో, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్, మల్టిప్లెక్స్ లు కలిసి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ప్రస్తుతం ఈ జీవోని ఆపాలని, తదుపరి విచారణ ఈ నెల 27న ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంచిపనికి కూడా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దీనిపై బుక్ మై షో, థియేటర్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.