Apple iPhone SE3 : సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE3 5G వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ కొత్త స్మార్ట్ ఫోర్ వస్తోంది. సరసమైన ధరకే మార్చి 2022లో అందుబాటులోకి రానుంది. ఆపిల్ కంపెనీ Apple iPhone SE3 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది.

Apple iPhone SE3 : సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE3 5G వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

Apple Iphone Se3 Apple Iphone Se3 2022 Expected To Be Priced At 300 Dollars

Apple iPhone SE3 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ కొత్త స్మార్ట్ ఫోర్ వస్తోంది. సరసమైన ధరకే మార్చి 2022లో అందుబాటులోకి రానుంది. ఆపిల్ కంపెనీ Apple iPhone SE3 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఐఫోన్
SE3 మోడల్ ధర, ఫీచర్లకు సంబంధించి వివరాలను ఓ నివేదిక వెల్లడించింది. రాబోయే iPhone SE 3 2022 ప్రారంభ ధర $300 (దాదాపు రూ. 22,000)తో రావచ్చని మార్కెట్ విశ్లేషకుడు జాన్ డోనోవన్ అంచనా వేస్తున్నారు. ఐఫోన్ SE 3 ధర
iPhone SE 2020 కన్నా తక్కువ ధరకే అందబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

iPhone SE 3 ఫోన్ మెరుగైన ప్రాసెసర్, 5G సపోర్టుతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. మార్కెట్ విశ్లేషకుడు జాన్ డోనోవన్ ప్రకారం.. iPhone SE 3 సరసమైన ధరకే రావొచ్చునని అంటున్నారు. స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర
$300 (దాదాపు రూ. 22,000) ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఐఫోన్ SE 2020 ఫోన్ ధర iPhone SE 3 2022 కన్నా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

రాబోయే iPhone SE 3 మెరుగైన ప్రాసెసర్‌తో పాటు మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలిపారు. పాత డిజైన్‌ను కలిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. iPhone SE 3 iPhone SE 2020 మాదిరిగానే 4.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని ఇదివరకే ఫీచర్లు లీకయ్యాయి. A15 బయోనిక్ చిప్‌సెట్ పవర్ అందించనుంది. iPhone 13 చిప్‌సెట్ X60 మోడెమ్‌తో ఈ కొత్త ఐఫోన్ వచ్చే అవకాశం ఉంది.

Apple Iphone Se 3 Apple Iphone Se 3 2022 Expected To Be Priced At 300 Dollars (1)

Apple Iphone Se 3 Apple Iphone Se 3 2022 Expected To Be Priced At 300 Dollars

iPhone SE 3 5G సపోర్టుతో 4GB RAM, 256GB స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. iPhone SE 3 మోడల్.. గతంలోని మోడల్ ఐఫోన్ల మాదిరిగా వెనుకవైపు ఒకే విధమైన 12-MP కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్..
iPhone SE 3 8-MP కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే.. iPhone SE 2020 1821mAh బ్యాటరీతో రానుంది. iPhone SE 3 మెరుగైన బ్యాటరీ లైఫ్, పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.

మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్న Apple స్ప్రింగ్ ఈవెంట్‌లో iPhone SE 3 లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే భారత్‌ మార్కెట్లో లాంచ్ కానుంది. గతంలో, iPhone SE 3 2022 ధర భారత మార్కెట్లో రూ. 40,000 కంటే తక్కువగా ఉండవచ్చని ఓ నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే.. iPhone SE 2020 ఫోన్ భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 39,900కే లాంచ్ అయింది. Apple iPhone SE 3 2022ని మాత్రం ఆపిల్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read Also : iPhone 13 Price Cut : అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!