Archana : మగధీర సినిమాలో ఛాన్స్ వదులుకున్నా.. అది చేసి ఉంటే..

  ‘తపన’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది వేద. ఆ తర్వాత అర్చనగా పేరు మార్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది.............

Archana : మగధీర సినిమాలో ఛాన్స్ వదులుకున్నా.. అది చేసి ఉంటే..

Archana

Archana :  ‘తపన’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది వేద. ఆ తర్వాత అర్చనగా పేరు మార్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, పౌర్ణమి, యమదొంగ, పాండురంగడు, ఖలేజా, లయన్‌.. ఇలా తెలుగు, తమిళ్, కన్నడలో చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం తాను నటించిన సినిమా టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌ జులై 1న విడుదలకానుంది. తాజాగా అలీతో సరదాగా షోకి అర్చన తన భర్త జగదీశ్ తో కలిసి రాగా ఈ షోలో పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇందులో అర్చన పాత విషయాలని షేర్ చేసుకుంది. అర్చన మాట్లాడుతూ.. ”శ్రీరామదాసు సినిమా చేసినప్పుడు నాకు అంతగా లౌక్యం తెలీదు. చిన్న ఏజ్, నన్ను సీతగా అంత బాగా చుపించారంటే అది రాఘవేంద్రరావు గారి వల్లే. మళ్లీ ఆయనతో పని చేయాలని ఉంది. అలాగే పాండురంగడు సినిమాలో ఓ బృందావనం నేపథ్య గీతానికి బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించాను, నేనే ఓ పాటని కంపోజ్ చేశాను. ఆయన బాగా చేశానని మెచ్చుకున్నారు” అని తెలిపింది.

Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..

అలాగే తాను మిస్ చేసుకున్న ఛాన్సుల గురించి చెప్తూ.. ”రాజమౌళిగారు మగధీరలో చేయమని ఓ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అంత సీరియస్ గా తీసుకోకుండా ఆ ఛాన్స్ ని వదిలేసుకున్నాను. అది చేసి ఉంటే కెరీర్ ఇంకోలా ఉండేది. ఆ ఛాన్స్ వదులుకున్నందుకు తర్వాత చాలా బాధపడ్డాను. ఆ తర్వాత కూడా కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయాయి” అని ఎమోషనల్ అయింది అర్చన. అర్చన గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.