Arjun Das : తెలుగులో కూడా నన్ను గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారు.. ఇకపై నెగిటివ్ రోల్స్ తగ్గిస్తాను..

తమిళ్ మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు నటుడు అర్జున్ దాస్. గతంలో చేసిన సినిమాలకంటే ఈ మూడు సినిమాలు అతనికి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇక అతని వాయిస్ గంభీరంగా ఉండటంతో అతని వాయిస్ తో కూడా బాగా...................

Arjun Das : తెలుగులో కూడా నన్ను గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారు.. ఇకపై నెగిటివ్ రోల్స్ తగ్గిస్తాను..

Arjun Das interesting comments on telugu people and his movies

Arjun Das :  తమిళ్ మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు నటుడు అర్జున్ దాస్. గతంలో చేసిన సినిమాలకంటే ఈ మూడు సినిమాలు అతనికి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇక అతని వాయిస్ గంభీరంగా ఉండటంతో అతని వాయిస్ తో కూడా బాగా పాపులర్ అయ్యాడు. తక్కువ టైంలో అతనికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు వచ్చారు. ప్రస్తుతం అర్జున్ దాస్ మలయాళ సినిమా కప్పేలా రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతున్న బుట్టబొమ్మ సినిమాతో డైరెక్ట్ తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా నటుడు అర్జున్ దాస్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలని, సినిమా విశేషాలని పంచుకున్నాడు.

మీడియా : మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి?
అర్జున్ దాస్ : పెరుమాళ్ తర్వాత చాలాకాలం ఎదురుచూశాను. ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ‘బుట్ట బొమ్మ’ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

మీడియా : ‘బుట్ట బొమ్మ’తో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
అర్జున్ దాస్ : ఒకసారి నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉంచి, ఈ సినిమా ఖచ్చితంగా మీరే చేయాలని అన్నారు. మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీ గారిని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. అప్పటివరకు నేను వంశీ గారిని కలవలేదు. ఆ రోజే ఆయనను మొదటిసారి కలిశాను. పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.

మీడియా : ఈ సినిమా మాతృక ఓటీటీలో అందుబాటులో ఉంది.. అయినా రీమేక్ చేయడానికి కారణం?
అర్జున్ దాస్ : ఇదే ప్రశ్న నిర్మాత వంశీ గారిని అడిగాను. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన నమ్మారు. అలాగే ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది.

మీడియా : ఈ చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి?
అర్జున్ దాస్ : ఇందులో నా పాత్ర పేరు ఆర్.కె. నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. కొత్త అనుభూతిని ఇస్తుంది.

మీడియా : తెలుగులో సినిమా చేయడం ఎలా ఉంది?
అర్జున్ దాస్ : తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు. ఒకసారి హైదరాబాద్ లో ఒక మాల్ కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో ఫోటోలు దిగడానికి రావడం చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ లభించిన స్వాగతం అసలు మరచిపోలేను. కొందరికి నా పేరు గుర్తులేకపోయినా సినిమాల్లో పోషించిన పాత్రల పేరుతో పిలుస్తూ మాట్లాడిస్తున్నారు. నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా దగ్గర అయ్యాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను.. కానీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. నాకు తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం, డబ్బింగ్ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా చేరువయ్యాయని తెలియడం చాలా సంతోషంగా ఉంది.

మీడియా : ఎక్కువగా నెగటివ్ పాత్రలు చేయడానికి కారణం?
అర్జున్ దాస్ : అలా అని ఏంలేదు. నా దగ్గరకు వస్తున్న పాత్రలను బట్టి ఎంచుకుంటున్నాను. నేను అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెగటివ్ రోల్స్ లో కూడా ఏదైనా కొత్తదనం ఉంటేనే చేస్తాను. అలాగే విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా ఇంకా నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. నెగిటివ్ రోల్స్ తగ్గించాలని చూస్తున్నాను. ఖైదీ తర్వాత ఎక్కువగా నెగటివ్ రోల్స్ వచ్చాయి. మాస్టర్ తర్వాత ఊహించనివిధంగా రొమాంటిక్ రోల్స్ కూడా వచ్చాయి. ఇలా ఒక్కో సినిమా తర్వాత ఒక్కో రకమైన పాత్రలు వస్తున్నాయి.

KL Rahul-Athia Shetty : బాలీవుడ్ స్టార్ యాక్టర్ కూతురితో ఇండియన్ క్రికెటర్ పెళ్లి.. మొదలైన పెళ్లిపనులు..

మీడియా : మీ గొంతుకి ఎందరో అభిమానులున్నారు. ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ మీరే చెప్తున్నారా?.
అర్జున్ దాస్ : అవును ఎక్కువగా నా వాయిస్ గురించి మాట్లాడుతుంటారు. అలాగే నా నటనను కూడా ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాను. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు.మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి, ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.