Armaan Malik : ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది.. వెయిట్ చేయండి.. మహేష్ ఫ్యాన్స్‌పై సీరియస్ అయిన సింగర్

మహేష్ అభిమానులంతా అర్మాన్ మాలిక్ సోషల్ మీడియాకి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ వరుస మెసేజ్ లు చేస్తున్నారు, అంతే కాక పోస్టులు పెట్టి వాటికి అర్మాన్ మాలిక్ ని.........

Armaan Malik : ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది.. వెయిట్ చేయండి.. మహేష్ ఫ్యాన్స్‌పై సీరియస్ అయిన సింగర్

Arman Malik

Updated On : April 18, 2022 / 9:35 AM IST

 

Armaan Malik :  అభిమానులు తమ హీరోల సినిమాల కోసం, సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఒక వేల లేట్ అయితే ఆ సినిమాకి పని చేసేవాళ్ళకి సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తూ చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక త్వరలోనే మూడో కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. తెలుగులో బుట్టబొమ్మ సాంగ్ తో మంచి ఫేమస్ తెచ్చుకున్నాడు నార్త్ సింగర్ అర్మాన్ మాలిక్. ఆ తర్వాత తెలుగులో పలు పాటలు పాడారు. తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో అంతకు ముందు కూడా పాటలు పాడినా బుట్టబొమ్మతో గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తమన్ అర్మాన్ మాలిక్ తో సర్కారు వారి పాటలో కూడా పాడించాడు.

Nikesha Patel : పెళ్లి కొడుకు దొరికాడు అంటున్న పవన్ హీరోయిన్

దీంతో మహేష్ అభిమానులంతా అర్మాన్ మాలిక్ సోషల్ మీడియాకి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ వరుస మెసేజ్ లు చేస్తున్నారు, అంతే కాక పోస్టులు పెట్టి వాటికి అర్మాన్ మాలిక్ ని ట్యాగ్ చేస్తున్నారు. ఇక మహేష్ అభిమానుల బాధని తట్టుకోలేక అర్మాన్ మాలిక్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”పాట ఎప్పుడు విడుదలవుతుందని నాకు మెసెజ్ చేస్తోన్న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నాను, ఆ పాట ఎప్పుడు వస్తుందని నాకు అస్సలు తెలియదు, ఆ పాట వినాలని మీరు ఎంత ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు, నేను కూడా అలానే ఫీల్ అవుతున్నా. కానీ ఇక్కడ ప్రతీ దానికి ఓ పద్దతి ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం ఓపిగ్గా ఎదురుచూడాల్సిందే” అని తెలిపాడు. ఇప్పటికైనా మహేష్ ఫ్యాన్స్ ఆగి అర్మాన్ ని వదిలేస్తారేమో చూడాలి.