CBI Probe: కేజ్రీవాల్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌ద్యం పాల‌సీపై సీబీఐ విచార‌ణ‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ సిఫార్సు

కేంద్ర ద‌ర్యాప్తు బృందాల‌ను వాడుకుంటూ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను అణ‌చివేయాల‌ని ఎన్డీఏ స‌ర్కారు కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న వేళ మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని వివాదాస్ప‌ద కొత్త‌ ఎక్సైజ్ పాల‌సీపై కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా సిఫార్సు చేశారు.

CBI Probe: కేజ్రీవాల్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌ద్యం పాల‌సీపై సీబీఐ విచార‌ణ‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ సిఫార్సు

Kejriwal2

CBI Probe: కేంద్ర ద‌ర్యాప్తు బృందాల‌ను వాడుకుంటూ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను అణ‌చివేయాల‌ని ఎన్డీఏ స‌ర్కారు కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న వేళ మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని వివాదాస్ప‌ద కొత్త‌ ఎక్సైజ్ పాల‌సీపై కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా సిఫార్సు చేశారు. సీఎం కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ మ‌ద్యం పాల‌సీ విధానంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఎత్తిచూపుతూ ఇటీవ‌ల ఓ నివేదిక విడుద‌లైంది. దీంతో దీనిపై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా సీబీఐ విచార‌ణకు ప్ర‌తిపాద‌న‌లు చేశారు. డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా పేరు కూడా ఇందులో ఉంది.

కొత్త ఎక్సైజ్ పాల‌సీద్వారా కొంద‌రికి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని నివేదిక‌లో ఉంద‌ని చెప్పారు. ఇందుకు సంబంధించిన‌ నిర్ణ‌యాల‌ను మ‌నీశ్ సిసోడియానే తీసుకున్నార‌ని అన్నారు. కాగా, ఈ కొత్త ఎక్సైజ్ పాల‌సీని గ‌త ఏడాది న‌వంబ‌రు 17 నుంచి అమ‌లు చేస్తున్నారు. కాగా, సీబీఐ విచార‌ణ‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా చేసిన‌ ప్ర‌తిపాద‌న‌లపై కేజ్రీవాల్ మండిప‌డ్డారు. ఆ ఆరోప‌ణల్లో నిజం లేద‌ని చెప్పారు. ఢిల్లీలో విద్య రంగ అభివృద్ధికి చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని, దీంతో ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పారు. ఇటువంటి వారిపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుస‌రికాద‌ని చెప్పారు. తప్పుడు కేసులో సిసోడియాను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు.

YouTube: అబార్ష‌న్లు చేసే ప్ర‌క్రియ‌పై త‌ప్పుడు స‌మాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చ‌ర్య‌లు