Aryan Khan : అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ లావాదేవీలు.. ఆర్యన్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడా?

ఆర్యన్‌ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తున్నాడని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో

Aryan Khan : అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ లావాదేవీలు.. ఆర్యన్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడా?

Aryan

Aryan Khan :  ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌లో నైట్ పార్టీల చాటున డ్రగ్స్ విక్రయం జరుగుతుందని తెలిసి ఎన్సీబీ అధికారులు ఇటీవల దాడి చేశారు. ఈ మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ పట్టుబడ్డాడు. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ వెల్లడించింది. ఆర్యన్ తో పాటు అతని స్నేహితులని కూడా అరెస్ట్ చేసింది. గత కొద్ది రోజులుగా ఆర్యన్ బెయిల్ పై కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ఇటు ఎన్సీబీ ఆర్యన్ కి డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉందని తెలియడంతో లోతుగా అధ్యాయం చేస్తుంది.

BiggBoss Priyanka : నేను ట్రాన్స్‌జెండ‌ర్‌గా మారడం రూపాయి కాయిన్ డిసైడ్ చేసింది : బిగ్ బాస్ ప్రియాంక

నిన్న ఆర్యన్ బెయిల్‌పై ముంబైలోని స్పెషల్‌ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ వి.వి.పాటిల్‌ సమక్షంలో ఇరుపక్షాలు రోజంతా తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఆర్యన్‌ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తున్నాడని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో ఆర్యన్‌కి సంబంధాలు ఉండటం ప్రాథమిక విచారణలో తేలిందని ఎన్సీబీ తెలిపింది. ఇక ఆర్యన్‌ విదేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించనున్నట్టు ఎన్సీబీ వెల్లడించింది.

Allu Arjun : మరోసారి అల్లు అర్జున్ బోయపాటి మాస్ కాంబినేషన్.. పుష్ప తర్వాతే??

ఆర్థిక అంశాలపై విచారణకు మరి కొంత సమయం పడుతుందని ఎన్‌సీబీ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ తెలిపారు. ఈ లోపు ఒక్క నిందితుడిని విడుదల చేసినా విచారణపై ప్రభావం చూపిస్తుందని వాదించారు. ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్‌ వాట్సాప్‌ చాట్స్‌ని పరిశీలిస్తే విదేశీయులకు భారీగా మాదక ద్రవ్యాలను పంపిణీ చేసిన విషయం తెలుస్తుందని వాదించారు. మరోవైపు ఆర్యన్‌ తరఫున హాజరైన అమిత్‌ దేశాయ్‌ ఎన్‌సీబీ చేసిన వాదనలు అర్థరహితమని కొట్టిపారేశారు. నిందితులు డ్రగ్స్‌ విక్రేతలు కాదని వాదించారు. ఇన్ని రోజులు ఆర్యన్ కేవలం డ్రగ్స్ వాడుతున్నాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ విక్రయిస్తున్నారు అని తెలియడంతో అధికారులు షాక్ కి గురవుతున్నారు. ఇప్పటిదాకా ఆర్యన్ కి సపోర్ట్ చేసిన బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయం తెలిసి ఆలోచిస్తున్నారు. ఎన్సీబీ తరపు న్యాయ మూర్తి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మత్తుకు బానిసలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.