Remdesivir Vials: ఎక్స్‌పైరీ డేట్‌కు చేరువలో రెమిడెసివిర్‌లు.. 60 లక్షల ఇంజక్షన్ల ధ్వంసం

సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కరోనా ఉధృతి పెరగకపోవడం కూడా వీటి వాడకం తగ్గేందుకు ఒక కారణం. ఈ నేపథ్యంలో రెమిడిసివర్ ఇంజక్షన్లు భారీగా మిగిలిపోయాయి. చాలా మెడిసిన్లు ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్నాయి. దీంతో వీటన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉంది.

Remdesivir Vials: ఎక్స్‌పైరీ డేట్‌కు చేరువలో రెమిడెసివిర్‌లు.. 60 లక్షల ఇంజక్షన్ల ధ్వంసం

Remdesivir Vials

Remdesivir Vials: గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ టైమ్‌లో రెమిడెసివిర్‌లకు ఉన్న డిమాండ్ తెలిసిందే. కరోనా చికిత్సకు బాగా పనిచేస్తాయన్న నమ్మకంతో అప్పట్లో వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడి, బ్లాకులో కొనుక్కోవాల్సి వచ్చింది. గంటల తరబడి వీటికోసం మెడికల్ షాపుల ముందు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి.

Russian Oil: రష్యా చమురు.. తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు భారత్ యత్నం

అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రెమిడిసివిర్‌లతో పెద్దగా ఉపయోగం లేదని తేలడంతో వీటి వాడకం తగ్గిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కరోనా ఉధృతి పెరగకపోవడం కూడా వీటి వాడకం తగ్గేందుకు ఒక కారణం. ఈ నేపథ్యంలో రెమిడిసివర్ ఇంజక్షన్లు భారీగా మిగిలిపోయాయి. చాలా మెడిసిన్లు ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్నాయి. దీంతో వీటన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 60 లక్షల రెమిడెసివర్‌లు ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్నాయని బీడీఆర్ ఫార్మ కంపెనీ ఛైర్మన్ ధర్మేష్ షా చెప్పారు. ముంబైకు చెందిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని అనేక సంస్థల దగ్గర కోవిడ్ సంబంధిత రెమిడెసివర్‌లతోపాటు, ఇతర ఔషధాలు కూడా ఉన్నాయి. అందులో 60 లక్షల రెమిడెసివర్‌ల విలువ దాదాపు 600 కోట్ల వరకు ఉంటుంది.

Minor Girl Raped : ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్‌లో మరో మైనర్‌ బాలికపై అత్యాచారం

ఇతర ఔషధాల విలువ దాదాపు 200-400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మొత్తం త్వరలో ఎక్స్‌పైర్ అవ్వనున్న మందుల విలువ 800-1000 కోట్ల వరకు ఉంటుంది. కోవిడ్ కేసులు భారీ స్థాయిలో నమోదు కాకపోవడంతో ఔషధ తయారీ సంస్థల వద్ద ఈ నిల్వలు పేరుకుపోయాయి. ఎక్స్‌పైరీ డేట్‌కు చేరుకున్న ఔషధాల్ని నాశనం చేయడం తప్ప కంపెనీలకు మరో ప్రత్యామ్నాయం లేదు.