Prabhas : ప్రాజెక్ట్ K సినిమా ఎవెంజర్స్ రేంజ్‌లో ఉంటుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అశ్వినీదత్..

అశ్వినీదత్ ప్రాజెక్ట్ K సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ K సినిమా షూట్ కి వెళ్లిన ప్రతి సారి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా ఎవెంజర్స్ రేంజ్ లో ఉంటుంది. చైనా, అమెరికా, ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో.......

Prabhas : ప్రాజెక్ట్ K సినిమా ఎవెంజర్స్ రేంజ్‌లో ఉంటుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అశ్వినీదత్..

Project K :  ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల లిస్ట్ లో ప్రాజెక్ట్ K ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పటాని.. ఇలా చాలా మంది స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూట్ జరుగుతుంది. తాజాగా అశ్వినీదత్ సీతారామం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రాజెక్టు K సినిమా గురించి మాట్లాడారు.

Shamshera : సినిమా చూడకుండానే ఫ్లాప్ అంటున్నారు.. షంషేరా సినిమాపై సంజయ్ దత్ ఎమోషనల్ పోస్ట్..

అశ్వినీదత్ ప్రాజెక్ట్ K సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ K సినిమా షూట్ కి వెళ్లిన ప్రతి సారి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా ఎవెంజర్స్ రేంజ్ లో ఉంటుంది. చైనా, అమెరికా, ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని నిర్మిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. అమితాబ్ బచ్చన్ గారు చాలా కొత్త పాత్ర చేస్తున్నారు. ప్రాజెక్ట్ K సినిమా 2024 దసరాకి రిలీజ్ చేస్తాం” అని తెలిపారు.