Big Boss 5 Tamil: ఐదవ సీజన్ ముహూర్తం ఖరారు.. హోస్ట్ మళ్ళీ లోకనాయకుడే!

ఒకవైపు తెలుగులో బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై మూడవ వారం దిగ్విజయంగా నడుస్తుండగా.. బుల్లితెర మీద మంచి రేటింగ్ కూడా సొంతం చేసుకుంటుంది. మిగతా ఛానెళ్ల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నా..

Big Boss 5 Tamil: ఐదవ సీజన్ ముహూర్తం ఖరారు.. హోస్ట్ మళ్ళీ లోకనాయకుడే!

Big Boss 5 Tamil

Updated On : September 23, 2021 / 11:13 AM IST

Big Boss 5 Tamil: ఒకవైపు తెలుగులో బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై మూడవ వారం దిగ్విజయంగా నడుస్తుండగా.. బుల్లితెర మీద మంచి రేటింగ్ కూడా సొంతం చేసుకుంటుంది. మిగతా ఛానెళ్ల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నా సీనియర్ హీరో నాగార్జున బిగ్ బాస్ కలిసి ఈ షోని రక్తికట్టిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగానే పొరుగునున్న తమిళ సీమలో కూడా ఐదవ సీజన్ బిగ్ బాస్ మొదలు కాబోతుంది. ఇప్పటికే తాజా సీజన్ కోసం ముహూర్తం కూడా పెట్టేసిన బిగ్ బాస్ లోకనాయకుడే ఈ సీజన్ కూడా హోస్ట్ గా ప్రకటించారు.

Telugu Upcoming Film: జతకట్టిన కోటి కుమారుడు.. వాణీ విశ్వనాథ్ కుమార్తె!

అక్టోబర్ 3 నుంచి తమిళ బిగ్‌బాస్ ఐదవ సీజన్ విజయ్ టీవీలో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించగా ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తుంది. నిజానికి తమిళంలో కూడా ఈ సీజన్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. తెలుగులో మాదిరే అక్కడ కూడా కరోనా లాక్ డౌన్ తో పాటు హోస్ట్ గా ఎవరన్నదానిపై కూడా కొంత డిలే అవుతూ వచ్చింది. అయితే.. చివరికి ఈసీజన్ కూడా కమల్ హాసన్ నడిపిస్తాడని షో నిర్వాహకులు ప్రకటించేశారు.

Jr NTR: తాత సెంటిమెంట్.. లంబోర్ఘిని కోసం రూ.17 లక్షల నెంబర్!

తెలుగులో ఈ షోకు ఎన్టీఆర్ నుండి నాని, నాగ్ ఇలా హోస్టులు మారారు కానీ తమిళనాట మాత్రం కమల్ హాసన్ ఒక్కరే నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు పూర్తైన నాలుగు సీజన్ల నుండి ఇప్పుడు మొదలయ్యే ఐదో సీజన్ వరకు ఆయనే హోస్ట్. గత కొన్నాళ్ళుగా కమల్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం.. రాజకీయాలలో భాగంగానే బిగ్ బాస్ హోస్ట్ చేయనని కూడా ప్రకటించాడు. కానీ, మొన్నటి ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత కమల్ ఇప్పుడు మళ్ళీ అటు సినిమాలతో పాటు బిగ్ బాస్ కొత్త సీజన్ కు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ సారి తమిళ బిగ్‌బాస్‌లో కాంట్రవర్సీలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం వస్తుండగా కమల్ ఈ సీజన్ ఎలా రక్తికట్టిస్తాడోనని ఆసక్తి నెలకొంది.