Priyanka Singh : స్టార్ రైటర్‌తో ప్రియాంక సింగ్.. త్వరలో సినిమా..

తాజాగా ప్రియాంక ఓ సినిమా ఛాన్స్ సాధించిందని తెలుస్తోంది. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది ప్రియాంక. టాలీవుడ్ స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్‌ని ప్రియాంక సింగ్ కలిసింది......

Priyanka Singh : స్టార్ రైటర్‌తో ప్రియాంక సింగ్.. త్వరలో సినిమా..

Priyanka Singh

Priyanka Singh :   జబర్ధస్త్‌ షోలో లేడీ గెటప్‌తో పేరు తెచ్చుకుంది ప్రియాంక సింగ్. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారి టీవీ షోలలో అలరిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేయడంతో బాగా ఫేమ్ తెచ్చుకుంది ప్రియాంక. బిగ్ బాస్ లో మానస్ తో చనువుగా ఉంటూ బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలు టార్గెట్ గా ట్రై చేస్తుంది ప్రియాంక.

Balakrishna : ఊరంతా కలిసి చూసిన ‘అఖండ’

తాజాగా ప్రియాంక ఓ సినిమా ఛాన్స్ సాధించిందని తెలుస్తోంది. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది ప్రియాంక. టాలీవుడ్ స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్‌ని ప్రియాంక సింగ్ కలిసింది. ఆయనతో సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. వీరి సమావేశం చాలా సేపు సాగింది. కోన వెంకట్ ని కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”ఒక సర్‌ప్రైజింగ్ న్యూస్ రాబోతుంది. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సార్” అంటూ పోస్ట్ చేసింది. మరి ఆ సర్‌ప్రైజింగ్ న్యూస్ ఏంటో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే. ఆమె అభిమానులు, సినీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం కోన వెంకట్ సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.