పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..: 10th ఎగ్జామ్ రాయటానికి వెళ్లి పెళ్లి చేసుకొచ్చిన యువతి

పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..: 10th ఎగ్జామ్ రాయటానికి వెళ్లి పెళ్లి చేసుకొచ్చిన యువతి

Bihar girl marries lover after leaving home :   పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..ఐయామ్ సో హ్యాపీ అంటోందో అమ్మాయి. 10th క్లాస్ పరీక్ష రాయటానికని ఇంటినుంచి వెళ్లిన ఆ అమ్మాయి తను అప్పటికే ప్రేమించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. పరీక్ష రాయటానికని వెళ్లి మెడలతో తాళి..పూల దండలతోవచ్చిన కూతుర్ని చూసి షాక్ అయ్యారా తల్లిదండ్రులు..

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో మణిహరి ప్రాంతానికి చెందిన గౌరికి 2016లో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరాని లిఫ్ట్ చేద్దామనుకనేలోపే అది కట్ అయ్యింది. ఫోన్ చేసింది ఎవరాని..తిరిగి కాల్ బ్యాక్ చేసిన గౌరికి నితీశ్‌ అనే యువకుడితో పరిచయం అయ్యింది. ‘మిస్సిడ్ కాల్’తో మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది.

అలా నాగేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాల వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ వారు ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. పెద్దలను ఎదిరించి అయినా సరే పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకున్నారు. అలా శనివారం (ఫిబ్రవరి 20,2021) 10Th పరీక్ష రాద్దామని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన గౌరి ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది.

అలా పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన గౌరి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. అయితే పరీక్ష రాసేందుకు లోనికి వెళ్లకుండా అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న నితీశ్‌తో కలిసి గుడికి వెళ్లింది. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి పోలీసుల సహాయం కోరారు. ఇద్దరు మేజర్లు కావడంతో వీరి ప్రేమ వివాహానికి పోలీసులు అభ్యంతరం చెప్పలేదు. గుడిలో వీరిద్దరు పోలీసుల సమక్షంలో పెండ్లి చేసుకున్నారు.అనంతరం నూతన దంపతులిద్దరూ పోలీసుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీసులు కూడా తీసుకున్నారు.

అయితే పరీక్ష రాయలేకపోయినందుకు గౌరికి ఏ మాత్రం బాధ లేదు. పరీక్ష రాయపోతే పరీక్షలో మాత్రమే ఫెయిల్ అవుతాను. కానీ ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోకుండా దూరం చేసుకుంటే జీవితంలోనే ఫెయిల్ అవుతాను. అందుకే ప్రేమించినవాడిని వదులుకోవాలనుకోలేదు. పరీక్ష మరో సంవత్సరం అయినా రాస్తాను. పాస్ అవుతానని ధీమా వ్యక్తంచేసింది.

ప్రస్తుతం తాను ప్రేమలో పాస్‌ అయ్యానని..వచ్చే ఏడాది పరీక్షను రాస్తానని తెలిపింది. మరోవైపు వీరి పెండ్లి విషయాన్ని పోలీసులు ఇరు కుటుంబాలకు తెలియజేశారు. మణిహరి సబ్ డివిజన్ ఎస్‌డిపిఓ ఎంఎస్‌హెచ్ ఫఖ్రీ మాట్లాడుతూ..వారిద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెండ్లి చేసుకున్నారని ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పారు. దీంతో గౌరి తాను పెండ్లాడిన ప్రియుడు నితీశ్‌ను తీసుకుని తన ఇంటికి వెళ్లింది. దీంతో చేసేదేమీ లేక ఇరు కుటుంబాలవారు వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారి పెళ్లిని ఒప్పుకోక తప్పలేదు.