Corpse ATM Card : క‌రోనా మృతుడి ఏటీఎం కార్డు చోరీ..నగదు మాయం చేసిన మున్సిపల్ ఉద్యోగులు

కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి ATM కార్టు చోరీ చేసి లక్ష రూపాయలకు పైగా మాయం చేసిన ఘటన బీహార్‌లోని ససారాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఉద్యోగులు..శ్మశానవాటిక నిర్వాహకుడు కలిసి మృతుడి ఏటీఎం కార్డు చోరీ చేసి అతని ఎకౌంట్ లోంచి డబ్బుల మాయం చేశారు.

Corpse ATM Card : క‌రోనా మృతుడి ఏటీఎం కార్డు చోరీ..నగదు మాయం చేసిన మున్సిపల్ ఉద్యోగులు

Corpse Atm Card (1)

ATM card theft from a corpse : కరోనా బాధితులు ఎలాగైనా బతకాలనే ఆశతో..మహమ్మారితో పోరాడుతుంటే మరోపక్క ‘శవం మీద పేలాలు’ ఏరుకుతినేలా తయారయ్యారు కొంతమంది. కరోనా బాధితులనుంచి డబ్బులు..నగలు మాయం చేస్తున్న ఘటనలు గురించి వింటున్నాం. ఈక్రమంలో కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి ATM కార్టు చోరీ చేసి లక్ష రూపాయలకు పైగా మాయం చేసిన ఘటన బీహార్‌లోని ససారాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

బీహార్‌లోని ససారాం జిల్లాకు చెందిన అభిమన్యు కుమార్ అనే వ్యక్తి డిఎవి స్కూల్‌లో గుమాస్తాగా ప‌నిచేస్తుండేవారు. ఈక్రమంలో అభిమన్యు కుమార్ క‌రోనా సోకింది. దీంతో ఏప్రిల్ 30 న డెహ్రీ ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ ప్రోటోకాల్‌ ప్రకారం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడాలనికి లేకుండా పోయింది. దీంతో అభిమన్యు కుమార్ మృతదేహాన్ని డెహ్రీ మునిసిపల్ కౌన్సిల్ ఉద్యోగులు దహనం చేశారు.

భర్త మరణంతో అతని భార్య ఛాయా దేవి బాగా కృంగిపోయింది. ఆ తరువాత భర్త బ్యాంక్ ఎకౌంట్ నుంచి రూ.1,06,500 ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసిన‌ట్లుగా ఛాయాదేవి గుర్తించారు. దీంతో ఆమె దరిహాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొంతమంది అనుమానితులను విచారించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి డెహ్రీ ఎస్‌డీపీవో సంజయ్ కుమార్ నాయకత్వంలో స్పెషల్ పోలీస్ టీమ్ ను ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు.

ఈ కేసులో ముందుగా అనుమానితుడు శ్మశానవాటిక నిర్వాహ‌క సభ్యుడు విశాల్ డోమ్‌ను అరెస్ట్ చేసి విచారించగా మృతదేహం దగ్గరున్న‌ ఏటీఎం కార్డును దొంగిలించామని..అంత్య‌క్రియ‌ల‌కు ముందు అభిమన్యు కుమార్ ఖాతా నుంచి డబ్బును డ్రా చేసినట్లుగా విశాల్ ఒప్పుకున్నాడు. దీనికి సహకరించినవాళ్లందరి పేర్లు పోలీసులకు చెప్పాడు. దీంతో అభిమన్యుకు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకొచ్చిన మున్సిపల్ ఉద్యోగులను అరెస్టు చేసారు. అనంతరం వారి నుంచి డ్రా చేసిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.