Etela Rajender : అందుకే దీక్ష చేపట్టాం – ఈటల రాజేందర్

అసెంబ్లీలో తన ముఖం కనిపించవద్దని అకారణంగా తోటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద...

Etela Rajender : అందుకే దీక్ష చేపట్టాం – ఈటల రాజేందర్

T.bjp

BJP Prajaswamya Parirakshana Deeksha : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సీఎం నిరంకుశత్వానికి నిరసనగా దీక్ష చేపట్టడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. కుట్రపూరితంగా తనను బయటకు వెళ్లగొట్టారని, అసెంబ్లీలో తన గొంతు నొక్కాలని చూశారన్నారు. అంబెద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుగా తనను ప్రజలు శాసనసభకి పంపిస్తే సభలో లేకుండా చేశారని విమర్శించారు. అసెంబ్లీలో తన ముఖం కనిపించవద్దని అకారణంగా తోటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 2022, మార్చి 17వ తేదీ గురువారం రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టింది బీజేపీ. దీనికి పోలీసులు నిబంధనలు విధిస్తూ అనుమతినిచ్చారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే దీక్ష చేయాలని, దీక్షలో 200 మందికి మించకూడదని షరతు విధించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా దీక్షను కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు.

Read More : Telangana BJP : బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష.. పోలీసుల ఆంక్షలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ…అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధ్యమైనట్లు, ఇలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని సీఎం యోచిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఉమ్మడి సభ సమావేశాల్లో మాట్లాడే సంప్రదాయం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతోందన్నారు. మొత్తం శాసనసభను అవమానించినట్లు, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు 45 రోజులు జరిగితే.. 30 రోజులైనా జరగాల్సింది కానీ వారం రోజులకే పరిమితం చేశారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన వేల కోట్లు వెచ్చించడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని వాడుకుని తనను ఓడించాలని చూశారని ఆరోపించారాయన. కేసీఆర్ అహంకారానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటంగా హుజురాబాద్ ప్రజలు భావించారన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.