Telangana BJP : బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష.. పోలీసుల ఆంక్షలు

అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్‌కు సూచించినా పట్టించుకోలేదన్నారు. ట్రాఫిక్‌ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం.

Telangana BJP : బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష.. పోలీసుల ఆంక్షలు

Bjp

BJP To Protest : తెలంగాణ బీజేపీ నేతల దీక్షపై ఉత్కంఠ నెలకొంది. 2022, మార్చి 17వ తేదీ గురువారం ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఈ దీక్ష చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ దీక్షపై పోలీసులు పలు నిబంధనలు, ఆంక్షలు విధించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే దీక్ష చేయాలని, దీక్షలో 200 మందికి మించకూడదని షరతు విధించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా దీక్షను కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు.

Read More : BJP Bandi Sanjay : దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం : బండి సంజయ్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తీరుతామన్నారు. ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష తలపెట్టింది. తొలుత దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర అని.. బీజేపీ పేరు వింటేనే సీఎం కేసీఆర్‌ వెన్నులో వణుకుపుడుతోందని బండి సంజయ్ ప్రకటనలో తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్‌ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయడం అందులో భాగమేనన్నారు.

Read More  : Bandi Sanjay: అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యంతో ఉండాలి – బండి సంజయ్

అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్‌కు సూచించినా పట్టించుకోలేదన్నారు. ట్రాఫిక్‌ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోందన్నారు. కేసీఆర్‌ అవినీతి, కుటుంబ, నియంత పాలనను అంతం చేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మొత్తానికి పోలీసులు అనుమతినివ్వడంతో దీక్ష చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది.