BJP Bandi Sanjay : దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం : బండి సంజయ్

దమ్ముంటే  కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలక శాఖమంత్రి  కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

BJP Bandi Sanjay : దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం : బండి సంజయ్

Bandi Sanjay Raja Singh

Updated On : March 13, 2022 / 8:43 PM IST

Telangana BJP Chief  Bandi Sanjay :  దమ్ముంటే  కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలక శాఖమంత్రి  కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

“మీ నాన్న అన్నాడు కదా దమ్ముంటే టచ్ చేయండని..  ఇప్పుడు టచ్ చేయండి.. దమ్ముంటే నీళ్లు, కరెంటు బంద్ చెయ్ చూస్తాం.. మాడి మసై పోతావు.. ” అంటూ బండి సంజయ్ ఘూటుగా వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ లో ఏమేం ఉంటాయో తెలుసా..? అక్కడ సైనికులు ఉంటారు.. బంకర్లు ఉన్నాయి.. అనిసంజయ్ చెప్పారు.
Also Read : Harish Rao On Houses : గుడ్‌న్యూస్… ఏప్రిల్ నుంచి ఇళ్ల నిర్మాణం -హరీశ్ రావు
కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ద్రోహులే అనుకున్నా… కాదు దేశ ద్రోహులు అని ఆయన అన్నారు. అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశారని ఎంత దమ్ముంటే దేశ సైనికులు ఉన్న చోటులోనే కరెంటు కట్ చేస్తా అంటావని బండిసంజయ్ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దేశ విచిన్న వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని…సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు.

ఈరోజు ఆయన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కశ్మీర్ ఫైల్స్ సినిమాను తిలకించారు. అనేక ఏళ్ల నుంచి అక్కడ ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి..గతంలో ఇలాంటి సినిమాలు తీసినా .. నటించినా వారు బ్రతుకుతారో లేదో తెలియకుండే పరిస్ధితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రధానిగా మోడీ వచ్చిన తరువాత ఇలాంటి సినిమాలు తీస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
Also Read : Transfenders Cafe : ఆ కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్సే
ఆర్టికల్ 370 రద్దుపై వాస్తవాలు ఈ సినిమాలో చూపించారని…కూహానా సెక్యులర్ వాదులకు ఈ సినిమా చూపించాలని ఆయన సూచించారు. దేశంలో కుహనా సెక్యులర్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని… ఆధారాలు అడిగే వారికి ఈ సినిమా చూపించాలని… వాస్తవ విషయాలను ఆధారంగా చేసుకుని సినిమా తీసారని బండి సంజయ్ చెప్పారు. సెన్సార్ సమస్య వల్ల అక్కడ జరిగిన అన్యాయాన్ని కేవలం 5 శాతమే ఈ సినిమాలో చూపించారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. దీంతోనే అక్కడ ఏమి జరిగి ఉంటుందనేది అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు.