Body Odor: శరీర దుర్గందం నుంచి విముక్తి కోసం

ఇతరులతో పోలిస్తే కొందరిలో శరీరం నుంచి వచ్చే వాసన దారుణంగా ఉంటుంది. ఈ దుర్గంధ సమస్యతో నలుగురిలో ఉన్నప్పుడు కంఫర్టబుల్‌గా ఉండలేరు. వీలైనంత త్వరగా సమస్యను తెలుసుకుని పరిష్కారం గురించి ఆలోచించడం మంచిది.

Body Odor: శరీర దుర్గందం నుంచి విముక్తి కోసం

Body Odor

Body Odor: ఇతరులతో పోలిస్తే కొందరిలో శరీరం నుంచి వచ్చే వాసన దారుణంగా ఉంటుంది. ఈ దుర్గంధ సమస్యతో నలుగురిలో ఉన్నప్పుడు కంఫర్టబుల్‌గా ఉండలేరు. వీలైనంత త్వరగా సమస్యను తెలుసుకుని పరిష్కారం గురించి ఆలోచించడం మంచిది. కేవలం స్నానంతో మాత్రమే సమస్య తగ్గనివారూ ఉంటారు. వారి కోసమే ఈ చిట్కాలు.

మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి.
వాతావరణాన్ని బట్టి రోజుకు కనీసం ఒక్కసారైనా స్నానం చయండి. చెమట ఎక్కువగా రావడం, దాంతో దుర్గందం ఎక్కువగా ఉండే రెండు సార్లు స్నానం చేయడం బెటర్. బ్యాక్టీరియా తగ్గేందుకు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు వాడండి. స్నానం చేశాక శుభ్రమైన పొడి టవల్ తో తుడవండి.

ప్రత్యేక తైలాలు
దుర్గంధ సమస్య ఉంటే రెండుపూటలా స్నానం చేయాలి. ఎండ ఎక్కువ ఉన్న రోజుల్లో చన్నీటి స్నానం శరీర ఉష్ణోగ్రతను సమతులం చేస్తుంది. స్నానం చేసే నీళ్లలో రెండు మూడు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపితే బెటర్. అవే కాకుండా లావెండర్‌, రోజ్‌మేరీ, టీట్రీలాంటి గాఢ తైలాలు శరీరం నుంచి వెలువడే దుర్గంధాన్ని దూరం చేస్తాయి.

వేప, టమాటా మిశ్రమం
దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను (సూక్ష్మజీవుల్ని) పారదోలడానికి వేప మిక్చర్ బాగా పనికొస్తుంది. పది వేపాకుల్ని తీసుకుని, మంచినీళ్లలో కాసేపు నానబెట్టి మిక్సీపట్టి చంకలు, అరికాళ్లలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. టమాటాను పల్చటి ముక్కల్లా లేదా పేస్టులా చేసి దుర్వాసన వెదజల్లే చోట రాయాలి.

బంగాళదుంపలతో
బంగాళదుంపను గుండ్రటి ముక్కలుగా తరిగి.. చంక లేదా అరికాళ్లలో పదినిమిషాల పాటు రుద్ది తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్దిరోజుల పాటు చేస్తే దుర్వాసన దూరం అవుతుంది. ముక్కలుగా కంటే బంగాళదుంపను పేస్ట్‌ లాగా వాడినా మంచిదే.

కలబంద గుజ్జుతో
కలబంద మొక్క నుంచి గుజ్జును వేరు చేయాలి. అందులో దూది లేదా గుడ్డ నానబెట్టి.. కాసేపటి వరకూ అలానే ఉంచాలి. ఆ వస్త్రంతో దుర్వాసన వచ్చే శరీర భాగాల్ని శుభ్రపరిస్తే క్రమంగా సమస్య దూరం అయినట్లే.

వాటర్ ట్రీట్మెంట్
శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో నీటి పాత్ర ప్రధానం. వాతావరణంలోని రకరకాల కాలుష్యాలు శరీర దుర్గంధానికి కారణం కావచ్చు. కాబట్టి మంచినీళ్ల్లు, పండ్ల రసాలు పుష్కలంగా తీసుకోవాలి. నానబెట్టిన మెంతులు తిన్నా మంచిదే.