Bollywood Movies : మొన్నటిదాకా టాలీవుడ్.. ఇప్పుడు బాలీవుడ్.. రిలీజ్ డేట్స్ కోసం కొట్టుకుంటున్న మేకర్స్..

అక్షయ్ కుమార్ ,అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, కంగనా, కరణ్.. ఇలా స్టార్లంతా ఈ ఇయర్ సెకండాఫ్ లో రిలీజ్ క్లాష్ ఫేస్ చెయ్యబోతున్నారు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ధియేటర్లో పోటీ...................

Bollywood Movies : మొన్నటిదాకా టాలీవుడ్.. ఇప్పుడు బాలీవుడ్.. రిలీజ్ డేట్స్ కోసం కొట్టుకుంటున్న మేకర్స్..

Bollywood Movies :  గత సంవత్సరం లాక్ డౌన్ అయ్యాక అప్పటిదాకా ఆగిన తెలుగు సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ లు అనౌన్స్ చేసి డేట్స్ క్లాష్ చేసుకున్నారు. మా సినిమా రిలీజ్ చేయాలి అంటే మా సినిమా రిలీజ్ చేయాలని గొడవలు కూడా పెట్టుకొని చివరికి నిర్మాతలు అంతా కూర్చొని మాట్లాడుకొని ఒకరి కోసం ఒకరు తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే క్లాష్ బాలీవుడ్ లో వస్తుంది. లాక్ డౌన్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అయినవి సక్సెస్ కూడా అవ్వలేదు. దీంతో ఆగిన సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ లకి రెడీ అవుతున్నాయి.

అక్షయ్ కుమార్ ,అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, కంగనా, కరణ్.. ఇలా స్టార్లంతా ఈ ఇయర్ సెకండాఫ్ లో రిలీజ్ క్లాష్ ఫేస్ చెయ్యబోతున్నారు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ధియేటర్లో పోటీ పడబోతున్నారు అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్, భూమి పెడ్నేకర్ జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న రక్షా బంధన్ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ అనౌన్స్ చేసింది. ఇక ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న అమీర్ ఖాన్ , కరీనా కపూర్ లాల్ సింగ్ చద్దా సినిమా కూడా ఎన్నో రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుని ఆఖరికి అదే అగస్ట్ 11న ధియేటర్లోకి రాబోతోంది. ఈ ఇద్దరు హీరోలు ఇండిపెండెన్స్ డే వీకెండ్ ని టార్గెట్ చేసుకొని రావడానికి రెడీ అవుతున్నారు.

Bollywood : సక్సెస్‌లు కరువై యాక్షన్ సీక్వెల్స్ మీద పడ్డ బాలీవుడ్

మరో రిలీజ్ ఫైట్ ని బాలీవుడ్ క్లాష్ అనడం కంటే సౌత్ వర్సెస్ బాలీవుడ్ క్లాష్ అనొచ్చేమో. ఎందుకంటే బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ లో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ వేద. ఐశ్వర్యారాయ్, విక్రమ్ లీడ్ రోల్స్ లో చేస్తున్న మణిరత్నం బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పొన్నియిన్ సెల్వన్ సినిమాలు ఒకే రోజు సెప్టెంబర్ 30నే రిలీజ్ కాబోతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ బేసిక్ గా తమిళ్ మూవీ అయినా పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో తెరకెక్కి అదే పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అసలే సౌత్ హీరోలు బాలీవుడ్ లో బీభత్సమైన కలెక్షన్లతో దూసుకపోతున్నాయి కాబట్టి బాలీవుడ్ సినిమా విక్రమ్ వేదకు మణిరత్నం సినిమా బాక్సాఫీస్ దగ్గర టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు జనాలు.

 

అసలు సిసలైన ఇంట్రస్టింగ్ క్లాష్ కంగనాకి కరణ్ జోహార్ కి జరగుతోంది. కరణ్ పేరుచెబితేనే ఒంటికాలు మీద లేచే కంగనా ఇప్పుడు కరణ్ చాలా కాలం తర్వాత చేస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమాతో పోటీపడుతోంది. రాజ్ కుమార్ రావ్, జాన్వికపూర్ జంటగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమా అక్టోబర్ 7న రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా తర్వాతే కంగనా కూడా తన యాక్షన్ ఎంటర్ టైనర్ తేజస్ మూవీని రెండు రోజుల గ్యాప్ తో రిలీజ్ చేస్తోంది. తేజస్ లో కంగనా పవర్ ఫుల్ పైలెట్ గా కనిపించబోతోంది.

Tamil Directors : తెలుగులోకి తమిళ డైరెక్టర్ల రాక..

ఈ సంవత్సరమే మరో క్లాష్ ఫేస్ చేస్తున్నారు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ తో. అజయ్ దేవగన్, సిద్దార్ద్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కతున్న ‘లైఫ్ డ్రామా’ దీపావళికి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాతో పాటే అక్షయ్ కుమార్ కాంట్రవర్షియల్ మూవీ రామ్ సేతు కూడా రిలీజ్ కాబోతోంది. మరి దీపావళికి రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయపు వెలుగులు చిందిస్తుందో చూడాలి.

ఈ సంవత్సరం అసలు క్లాష్ అంతా క్రిస్మస్, ఇయర్ ఎండ్ కే జరుగుతోంది. ఇప్పటి వరకూ ఇద్దరు హీరోలే రిలీజ్ ఫైట్ కి రెడీ అయితే ఈ సీజన్ కిమాత్రం రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి ఇలా ముగ్గురు పోటీపడుతున్నారు. రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కస్ తో పాటు, విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెర్రీ క్రిస్మస్ , టైగర్ ష్రాఫ్, కృతి సనన్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గణ్ పథ్ ఈ 3 సినిమాలు క్రిస్మస్ సీజన్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇలా బాలీవుడ్ సెకండాఫ్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న ఆనందం కన్నా బాలీవుడ్ హీరోల రిలీజ్ క్లాష్ తో ఫుల్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు బాలీవుడ్ వర్గాలు.