Ajith : ముగ్గురూ మూడోసారి.. భారీ బడ్జెట్‌తో అజిత్ సినిమా..!

అజిత్, బోనీ, వినోద్.. ఈ ముగ్గురు అంతకుముందు పింక్ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ కూడా చేశారు.. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ ప్లాన్‌లో ఉన్నారు..

Ajith : ముగ్గురూ మూడోసారి.. భారీ బడ్జెట్‌తో అజిత్ సినిమా..!

Boney Kapoor To Produce Ajith Next Movie

Ajith: తమిళ్ స్టార్ హీరో ఫుల్ స్పీడ్ మీదున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాలిమై’ కంప్లీట్ కాకుండానే.. మరో అప్‌కమింగ్ మూవీ మీద రూమర్లతో సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ముచ్చటగా మూడోసారి బోనీ కపూర్ ప్రొడ్యూస్ చెయ్యబోతున్న అజిత్ అప్‌కమింగ్ మూవీ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్..

అజిత్.. స్పీడ్ పెంచేశారు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కరోనా వల్ల లేటవడంతో ఇక షూటింగ్ విషయంలో లేట్ చెయ్యకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే ప్రజెంట్ చేస్తున్న ‘వాలిమై’ సినిమా కంప్లీట్ కాకుండానే నెక్ట్స్ సినిమా పనులు స్టార్ట్ చేశారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అజిత్ 60 వ సినిమా ‘వాలిమై’ వినోద్ డైరెక్షన్లో బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Nerkonda Paarvai

అజిత్, బోనీ, వినోద్.. ఈ ముగ్గురు అంతకుముందు పింక్ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ కూడా చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ ప్లాన్‌లో ఉన్నారు. అజిత్ 61 సినిమాని అంతకుమించి అనేలా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించి ఏప్రిల్‌లోనే స్క్రిప్ట్ వినేసిన అజిత్.. అప్పుడే ఓకే కూడా చెప్పేశారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జూలైలో స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు టీమ్.

అజిత్ స్టార్ డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో తెరకెక్కబోతున్న సినిమా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు. ‘వాలిమై’ షూటింగ్‌ని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ జూలై నాటికి కంప్లీట్ చేసి, థియేటర్లలో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చాక రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు అజిత్ అండ్ టీమ్.