Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెట్టకూడదని నోటీసులో పేర్కొన్నారు. ఇలా చేస్తే కరెంటును దొంగిలించినట్టేనని..అలాంటి వారిని గుర్తించి..జీతంలో నుంచి కొంత కట్ చేస్తామని చెప్పడంతో...

Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

Phone Charging

Charging Mobile Phones At Office : మొబైల్ ఛార్జింగ్ విషయంలో కొంతమంది సమస్యలు ఎదుర్కొంటుంటారు. సెల్ ఫోన్ లలో త్వరగా ఛార్జింగ్ అయిపోవడం, ఛార్జింగ్ పెట్టడం మరిచిపోతుంటారు. దీంతో ఛార్జింగ్ లను కూడా తమతో పాటు తీసుకెళుతుంటారు. కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ లు పెట్టుకుంటుంటారు. అయితే..ఓ అధికారి తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆఫీసులో ఎవరూ కూడా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టవద్దని నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఇలా చేస్తే…కరెంటు దొంగిలించినట్లేనని ఆయన వెల్లడించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. నోటీసు మాత్రం నెట్టింట వైరల్ గా మారుతోంది.

Read More : e commerce : ఆటో రిక్షా సేవలకు 5 శాతం జీఎస్టీ

పని చేసే సమయంలో ఫోన్ ల వినియోగం తగ్గించాలని..అధికంగా ఫోన్లను వాడుతున్నారని గ్రహించారో..ఏమో. ఫోన్లను ఉపయోగించవద్దని చెప్పినా కూడా వినిపించుకోకపోవడంతో ఓ అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసు గోడలపై నోటీసులు అంటించారు. ఆఫీసులో ఎవరూ వారి మొబైల్ ఛార్జింగ్ పెట్టకూడదని నోటీసులో పేర్కొన్నారు. ఇలా చేస్తే కరెంటును దొంగిలించినట్టేనని..అలాంటి వారిని గుర్తించి..జీతంలో నుంచి కొంత కట్ చేస్తామని నోటీసులో పేర్కొనడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు అవాక్కయ్యారు. ఆఫీసు స్టాప్ అంతా..మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేయాలని ఆదేశించారు. ఈ నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.