Brahmastra: బ్రహ్మాస్త్ర విజన్.. మామూలుగా లేదుగా!

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది.....

Brahmastra: బ్రహ్మాస్త్ర విజన్.. మామూలుగా లేదుగా!

Brahmastra The Vision Video Sets Fire

Brahmastra: బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సూపర్ ఫాంటసీ మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పురాతనకాలంలో అస్త్రాలు, వాటి ప్రత్యేకతలను మనకు చూపిస్తూనే.. ప్రస్తుతం అవి ఉండి ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. అసలు ఈ అస్త్రాలు వాటి వెనుక ఉన్న రహస్యాలు ఏమిటనే విషయాల గురించి తాజాగా ఈ చిత్ర యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

Brahmastra : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర.. ఎందుకు??

‘బ్రహ్మాస్త్ర ది విజన్’ అంటూ వచ్చిన ఈ వీడియోలో అస్త్రాల ఉద్భవం, వాటిని మహర్షులు ఏ విధంగా కాపాడుతూ వచ్చారు.. ఈ అస్త్రాలలో వానరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర మరియు బ్రహ్మాస్త్రలు ఉన్నాయి. మిగతా అస్త్రాలలోకెళ్లా బ్రహ్మాస్త్ర చాలా శక్తివంతమైనదిగా మహర్షులు గుర్తిస్తారు. ఈ అస్త్రాలను ఎప్పటికీ కాపాడాలని ఈ మహర్షులు నిశ్చయించుకుంటారు. అయితే మారుతున్న కాలంతో ఈ అస్త్రాలను మహర్షులు తమ వంశాలకు చెందిన వారికి అప్పజెప్పగా, వారు వాటిని సంరక్షిస్తూ వస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ సినిమాలోని హీరో అతీత శక్తులు కలిగి ఉంటాడని అతడికే తెలియదు.

Brahmastra Trailer : మెగా వాయిస్ తో.. బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్..

శివ అనే కుర్రాడు తనకు శక్తులు ఉన్నాయని గుర్తించగా, అతడికి ఈ అస్త్రాలతో సంబంధం ఏమిటంటే.. అతడే ఓ అస్త్రం అని మనకు ఈ సినిమాలో చూపించబోతున్నారు. అతడు కూడా ఓ అస్త్రం అని.. అగ్ని అస్త్రంగా అతడు తన శక్తులతో దుష్టశక్తులను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది మనకు బ్రహ్మాస్త్ర తొలిభాగంలో చూపించబోతున్నట్లు చిత్ర దర్శకుడు అయన్ ముఖర్జీ ఈ వీడియోలో తెలియజేశారు. మొత్తానికి బ్రహ్మాస్త్ర చిత్రం ఓ ట్రయాలజీ మూవీగా ప్రేక్షకులను విజువల్ వండర్‌తో మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.