Facebook: ఫేస్‌బుక్‍ నిర్లక్ష్యానికి రూ.515 కోట్లు జరిమానా

ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి అడిగిన వివరాలు సమర్పించడంలో కావాలనే జాప్యం చేసిందని అన్నారు.

Facebook: ఫేస్‌బుక్‍ నిర్లక్ష్యానికి రూ.515 కోట్లు జరిమానా

facebook

Facebook: బ్రిటన్ కాంపీటీషన్ రెగ్యూలేటర్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి అడిగిన వివరాలు సమర్పించడంలో కావాలనే జాప్యం చేసిందని అన్నారు. జరిమానాగా రూ.515కోట్లు (50.5 మిలియన్ పౌండ్లు) చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది.

ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేననే హెచ్చరిక విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది. ఫేస్‌బుక్‌ గతేడాది యానిమేటెడ్ సంస్థ జిపీని కొనుగోలు చేసింది. అయితే జిఫీ కొనుగోలు ద్వారా సోషల్ మీడియాల మధ్య పోటీనీ ఫేస్‌బుక్‌ నియంత్రిస్తోందన్న ఆరోపణలపై బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని పలుమార్పులు కోరినప్పటికీ అవి సమర్పించడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే వెనుకడుగేసిందని సీఎంఏ పేర్కొంది. మరోవైపు సీఎంఏ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ స్పందించి.. నిర్ణయాన్ని వ్యతిరేకించింది. సీఎంఏ నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.

……………………………………………….. : చిప్స్ ప్యాకెట్లో ‘ఆలుగడ్డ’.. కస్టమర్ షాక్!