Buffalo fight On Lions : సింహం సింగిల్‌గా కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపించిన గేదె..

సింహం సింగిల్ గానే కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపిస్తా..కుమ్మిపడేస్తా..వస్తారా ఛాలెంజ్ అన్నట్లుగా కొమ్ము విసిరి మరీ సవాల్ చేసిందో ఓ గెదె సింహాల గుంపుకు..

Buffalo fight On Lions : సింహం సింగిల్‌గా కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపించిన గేదె..

Buffalo fight On Lions

Buffalo fight On Lions : నాన్నా పందులే గుంపుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. స్టైల్ సిగ్నేచర్ రజనీకాంత్ బాషా సినిమాలో ఈ డైలాగ్ తో సింహం సింగిల్ అంటూ ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడేశారు. కానీ సింహం సింగిల్ గానే కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపిస్తా అన్నట్లుగా ఓ గేదె సింహాల గుంపుపై చేసిన పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది.

 

పోరాడితో పోయేదేమీలేదు బానిస సంకెళ్లు తప్ప అనే స్లోగన్ ను అందిపుచ్చుకున్నట్లుగా ఉంది ఓ గేదె పోరాటం. ఓ గేదె పోరాడితే పోయేదేమీ లేదు ప్రాణాలు దక్కుతాయన్నట్లుగా ఉంది ఈ పోరాటం చూస్తే.  ఓ గేదెని ఒకటికాదు రెండు కాదు దాదాపు 10 సింహాలు చుట్టుముట్టాయి. ఒక్క గేదె కదా దీన్ని ఇట్టే ఖతం చేసిన లాగించేద్దామనుకున్నాయి. కానీ ఈ గేదె బలం ముందు తెగువ ముందు సింహాల గుంపు చెల్లాచెదురైపోయింది.

Anand Mahindra : వారెవ్వా..! మెసలి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న జింక

ఇదేంటీ ఒక్కటే ఉంది మేం గుంపుగా ఉన్నాం చక్కగా పొట్టనిండుగా లాగించేద్దామనుకుంటే ఇలా ఎస్కేప్ అయ్యిందేంటీ…అంటూ తమకు చుక్కలు చూపించి తప్పించుకున్న గేదెను నిరాశగా చూస్తుండిపోయింది సింహాల గుంపు.10 సింహాలున్న గుంపుపై పోరాడి ప్రాణాలతో బయటపడ్డ ఓ గెదే వీడియో చూస్తే భీరక యుద్ధంలో ఓ గేదె తన పోరాటంతో సింహాల అహంకారాన్ని ఎలా దెబ్బకొట్టిందో అర్థమవుతుంది.

 

ఓ గెదెను వేటాడి తిందామనుకున్నాయి కొన్ని ఆడ సింహాలు. 10సింహాలు గుంపుగా వచ్చినా ఆ గేదె భయపడలేదు. పోరాడింది. వాటి బలాన్ని చెల్లాచెదురు చేసింది. తనపై దాడి చేయకుండా అటు ఇటు పరుగులు పెట్టించింది.  తన దగ్గరకు ఒక్కటంటే ఒక్క సింహం కూడా రాకుండా తరిమికొట్టింది. ఏ ఒక్క సింహం ఆ గేదె దగ్గరకొచ్చినా గొంతు పట్టేసుకుంటుంది. ఆ దెబ్బకు గేదె బలం సడలిపోయి కదలకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో మిగిలిని సింహాలని ఒకేసారి దాడి చేసి దాన్ని చీల్చి చెండాడుతాయి.

 

కానీ ఆ గేదె మాత్రం అలా ఏ ఒక్క సింహానికి కూడా ఆ అవకాశం ఇవ్వలేదు. తన వద్దకు ఏ సింహం రాకుండా పారదోలింది. అలా వాటిని తలోపక్కకు తరిమికొట్టింది. ఆ తరువాత తాపీగా సెలయేరుదాటి వెళ్లిపోయింది. దీంతో సింహాల గుంపుకు డంగైపోయాయి. ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని కళ్లముందు కనిపించిన ఆహారం నోటిదాకా రాలేదు. ఈ గేదె సామాన్యమైనదికాదు చాలా తెలివైనది అనుకుంటు ఉస్సూరుమంటూ ఆ గేదె వెళ్లిన దిక్కే చూస్తుండిపోయాయి. సింహాల గుంపుకు చుక్కలు చూపించిన ఈ గేదె పోరాటం అందరికి స్ఫూర్తినిచ్చేలా ఉంది.దీంతో సింహం సింగిల్ గానే కాదు గుంపుగా వచ్చిన నన్నేమీ చేయలేవనే గేదె ధైర్యానికి హ్యాట్సాఫ్అం అనిపించింది. అందుకే పోరాడితే పోయేదేమీ లేదు ఇలా అపాయంలో పడినప్పుడు ప్రాణాలు దక్కించుకోవచ్చని తెలుస్తోంది ఈ గేదె తెగువ చూస్తే..