Project K: ప్రాజెక్ట్ Kకు సంగీతం అందించేది ఎవరంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘ప్రాజెక్ట్ K’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, పూర్తి సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ను చిత్ర యూనిట్ మనకు చూపెట్టనుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Project K: ప్రాజెక్ట్ Kకు సంగీతం అందించేది ఎవరంటే..?

Buzz On Music Director For Project K Goes Viral

Updated On : February 25, 2023 / 3:20 PM IST

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘ప్రాజెక్ట్ K’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, పూర్తి సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ను చిత్ర యూనిట్ మనకు చూపెట్టనుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Project K : ప్రాజెక్ట్-K లో దుల్కర్ సల్మాన్.. నిజమేనా?

కాగా, ఈ సినిమాకు సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందిస్తున్నట్లు ఇదివరకు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాత అశ్వినీ దత్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించడం లేదని.. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్‌తో పాటు మరో యంగ్ ఫీమేల్ సెన్సేషన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు అశ్వినీ దత్ వెల్లడించారు.

Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్!

ఇక ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటాని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.