Father of New India Row: మోదీని ‘న్యూ ఇండియా’ జాతిపితగా అభివర్ణించడం ఆయనకే అవమానం: సంజయ్ రౌత్

‘‘నేటి నవీన భారతదేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం పెరిగిపోతోంది. ఇటువంటి నవీన భారతానికి జాతిపిత మోదీ అని అనడం ఆయనకే అవమానం’’ అని సామ్నా దినపత్రికలో సంజయ్ రౌత్ రాసుకొచ్చారు.

Father of New India Row: మోదీని ‘న్యూ ఇండియా’ జాతిపితగా అభివర్ణించడం ఆయనకే అవమానం: సంజయ్ రౌత్

Father of New India Row: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘న్యూ ఇండియా’ జాతిపితగా అభివర్ణించడం మోదీకే అవమానకరమని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. మోదీని నవభారత జాతిపిత అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ… ‘‘బీజేపీలోని ఒక్కరు కూడా సాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ ను జాతిపిత అని అనడం లేదు. కఠిన కారాగార శిక్ష అనుభవించిన సావర్కర్ ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా వ్యతిరేకించింది. వీరంతా దేశాన్ని పాత ఇండియా, కొత్త ఇండియాగా విభజిస్తున్నారు. నేటి నవీన భారతదేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం పెరిగిపోతోంది. ఇటువంటి నవీన భారతానికి జాతిపిత మోదీ అని అనడం ఆయనకే అవమానం’’ అని సామ్నా దినపత్రికలో రాసుకొచ్చారు.

మహాత్మా గాంధీకి జాతిపిత అనే హోదాను దేశ ప్రజలు ఇచ్చారని సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు జాతిపిత ఎవరన్న విషయం సమస్య కాదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటన్నదే అసలైన విషయమని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని అన్నారు.

Kurnool Honor Killing Case : ఆమోస్‌ను చంపింది ఎవరు? కర్నూలు పరువు హత్య కేసులో దర్యాఫ్తు ముమ్మరం