CBSE Result : జులై 31లోగా CBSE 12వ తరగతి ఫలితాలు..

జూలై 31 లోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

CBSE Result : జులై 31లోగా CBSE 12వ తరగతి ఫలితాలు..

Cbse 12 Class Result

CBSE 12 class result : జూలై 31 లోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించారు. CBSE – 12వ తరగతి మార్కుల నిర్ధారణ విధానాన్ని ప్రకటించిన క్రమంలో..10,11 క్లాస్ మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు విధానం ఉంటుందని తెలిపింది. 30+30+40 పార్ములా ఆధారంగా ఫలితాలను నిర్దారిస్తామని వెల్లడించింది. 10వ తరగతి మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, అలాగే 11వ తరగతి మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్, 12వ తరగతి మార్కుల నుంచి 40 శాతం వెయిటేజ్ ఉంటుందని తెలిపింది.

12వ తరగతి ఫలితాల విడుదలకు అనుసరించే ప్రణాళికను కోర్టుకు సమర్పించింది CBSE బోర్డు. 10వ తరగతిలో ప్రతిభకు 30 శాతం, 11వ తరగతిలో ప్రతిభకు 30 శాతం, 12వ తరగతతి ప్రీ బోర్డు ఫలితాలకు 40 శాతం వెయిటేజీ ఇస్తామని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ , జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనానికి వివరించింది. CBSE ఇచ్చిన మార్క్ లతో సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా కంట్రోల్ లోకి వచ్చాక పరీక్షలు రాసుకోవచ్చన్నారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.

మార్కుల ప్రణాళికను 13 మంది నిపుణులతో కూడిన కమిటీ సిపార్స్ చేసిందని సుప్రీంకోర్టుకు CBSE తెలిపింది. 1929 నుంచి బోర్డు ఉన్నా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని..కానీ ఈ కరోనా సమయంలో ఇటువంటివి తప్పటంలేదని వివరించింది. ఈ వివరణపై సుప్రీంకోర్టు.. మార్కులపై అభ్యంతరాలుంటే పరిష్కరించే మెకానిజం ఉండాలని సూచించిది. గత సంవత్సరం చాలా మంది మార్కులపై అభ్యంతరాలు చెబుతూ కోర్టును ఆశ్రయించారని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. కాబట్టి విద్యార్ధులకు..వారి తల్లిదండ్రులకు మార్కులపై అభ్యంతరాలు వినేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నామని అన్నారు అటార్నీ జనరల్ వేణుగోపాల్.