VIP security to Gautam Adani: గౌతమ్ అదానీకి వీఐపీ భద్రత కల్పించిన మోదీ ప్రభుత్వం

గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్‭డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్‭పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. 2013లో ముకేశ్‭కు ఈ భద్రత కల్పించగా ఆయన భార్య నీతా అంబానీకి కొన్నాళ్లకు తక్కువ కమాండోలతో భద్రత కల్పించారు.

Centre grants VIP security cover to industrialist Gautam Adani

VIP security to Gautam Adani: అదాని గ్రూప్ చైర్మన్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమి అదానికి ‘జెడ్’ కేటగిరీ వీఐపీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అదాని(60)కి భద్రతా సమస్య ఉందని జాతీయ భద్రతా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ భద్రతకు అదాని నుంచి పేమెంట్ తీసుకోనున్నట్లు కేంద్ర వెల్లడించింది. నెలకు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేయనున్నారట.

గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్‭డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్‭పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. 2013లో ముకేశ్‭కు ఈ భద్రత కల్పించగా ఆయన భార్య నీతా అంబానీకి కొన్నాళ్లకు తక్కువ కమాండోలతో భద్రత కల్పించారు.

Security breach: అజిత్ ధోవల్ ఇంటి వద్ద భద్రతా లోపం.. ముగ్గురు కమాండోల తొలగింపు